Monalisa Bhonsle : 10 రోజుల్లో 10 కోట్ల సంపాదన..! ఆ ప్రచారంపై మోనాలిసా ఏం చెప్పిందంటే..
చుట్టూ జనం చేరి ఫోటోల కోసం ఎగబడటంతో అసలు వ్యాపారం దెబ్బతింది. పైగా తన కూతురి సేఫ్టీ కోసం తండ్రి ఆమెను ప్రయాగ్ రాజ్ నుంచి ఇండోర్ కి పంపేశాడు.

Monalisa Bhonsle : ఓ మనిషికి ఓవర్ నైట్ పాపులారిటీ వస్తే ఎలాంటి కష్టాలు ఎదురవుతాయో అనే దానికి ఈ పూసల పిల్లే ఉదాహరణ. కుంభమేళాలో అసలు వ్యాపారం పక్కకు పోయి సెల్ఫీలకు ఎగబడటంతో ఇండోర్ కి వెళ్లిపోయింది. అయినా సోషల్ మీడియా జనం ఆమెను వదల్లేదు.
చక్కగా పది రోజుల్లో 10 కోట్ల రూపాయలు సంపాదించుకుంది తెలుసా అంటూ ప్రచారం మొదలు పెట్టారు. దీనిపైన చిర్రెత్తుకు వచ్చిందో ఏమో కానీ, సీన్ అంత లేదని తేల్చేసింది. పైగా తానే అప్పులపాలయ్యాను అంటూ వాస్తవాన్ని వివరించింది.
అసలు నిజంగా 10 కోట్లు ఉంటే ఈ ఇంట్లో ఎందుకు ఉంటా..
కుంభమేలా సుందరిగా పాపులర్ అయిన మోనాలిసా భోంస్లే ప్రయాగ్ రాజ్ లో ఉన్నది కొద్ది రోజులే అయినా భారీగా సంపాదించిందంటూ టాక్ నడిచింది. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం జనాలు కూడా తెగ కథలు అల్లేశారు. దీంతో మోనాలిసా స్పందించాల్సి వచ్చింది.
Also Read : ఎంత కర్మ పట్టిందిరా అయ్యా నీకు.. దొంగగా మారిన మాజీ ఎమ్మెల్యే కొడుకు.. ఎందుకో తెలిస్తే షాకే..
అసలు నిజం ఏంటో చెప్పింది. ఆ ప్రచారంలో నిజం లేదంది. అదంతా ఒట్టిదే అని కొట్టిపారేసింది. అసలు నిజంగా 10 కోట్లు ఉంటే పెంకుటింట్లో తాను ఎందుకు ఉంటానంటూ పూసల పిల్ల మండిపడింది.
10 రోజుల్లో 10 కోట్లు సంపాదిస్తే ఇంకా ఈ దండలు అమ్ముకోవాల్సిన గతి ఎందుకు?
కుంభమేళాలో ముత్యాలు, రంగు రాళ్ల దండలను అమ్ముతూ అందరి దృష్టిని ఆకర్షించింది మోనాలిసా. సోషల్ మీడియా ఇన్ ఫ్లుయన్సర్ల కన్ను పడటంతో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది. అయితే చుట్టూ జనం చేరి ఫోటోల కోసం ఎగబడటంతో అసలు వ్యాపారం దెబ్బతింది.
పైగా తన కూతురి సేఫ్టీ కోసం తండ్రి ఆమెను ప్రయాగ్ రాజ్ నుంచి ఇండోర్ కి పంపేశాడు. ఇదే విషయాన్ని ఆమె కూడా చెప్పుకొచ్చింది. 10 రోజుల్లో 10 కోట్లు సంపాదిస్తే ఇంకా ఈ దండలు అమ్ముకోవాల్సిన గతి ఎందుకని ప్రశ్నించింది.
ఇప్పుడు పోస్టర్ బయట, తర్వాత పోస్టర్ పై అంటూ.. సినిమాల్లో ఎంట్రీ గురించి కన్ ఫమ్..
ఇంకా దారుణమైన విషయం ఏంటంటే.. సెల్ఫీలు తప్ప సేల్స్ లేకపోవడంతో 35వేల రూపాయలు అప్పు చేయాల్సి వచ్చిందని మోనాలిసా వాపోయింది. అంతా బాగుంటే మరో కుంభమేళాకు వెళ్తానని చెబుతున్న ఈమెకు సినిమా ఆఫర్ మాత్రం నిజం.
మణిపూర్ ఫైల్స్ సినిమాలో నటించబోతున్న ఈమె.. హిందీ పుష్ప 2 పోస్టర్ ముందు నిలబడిన ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. పైగా ఈ ఫోటోకి ఒక ట్యాగ్ కూడా జోడించింది. ఇప్పుడు పోస్టర్ బయట, తర్వాత పోస్టర్ పై అంటూ.. సినిమాల్లో తన ఎంట్రీ గురించి కన్ ఫమ్ చేసింది.