Narendra Modi: చరిత్రాత్మక విజయాన్ని అందించారు: ప్రధాని మోదీ
ఝార్ఖండ్‌లో గెలిచిన జేఎంఎం కూటమికి కూడా ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.

PM Modi
మహారాష్ట్రలో మహాయుక్తి కూటమి గెలుపొందడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ధి, సుపరిపాలన విజయం సాధించాయని ప్రధాని మోదీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో చరిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టిన ఓటర్లకు కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు.
ఇలాగే ఐక్యంగా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి తాము కృషి చేస్తామని భరోసా ఇస్తున్నానని తెలిపారు. ప్రతి ఎన్డీఏ కార్యకర్త చేసిన కృషికి తాను గర్వపడుతున్నానని మోదీ చెప్పారు. వారు కష్టపడి పనిచేశారని, ప్రజల మధ్యకు వెళ్లి తమ సుపరిపాలన ఎజెండాను వివరించారని తెలిపారు.
ఝార్ఖండ్‌లో గెలిచిన జేఎంఎం కూటమికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ప్రజల సమస్యలను లేవనెత్తడంలో, ఝార్ఖండ్ కోసం పని చేయడంలో తాము అన్నివేళలా ముందుంటామని చెప్పారు. తమకు మద్దతు తెలిపిన ఝార్ఖండ్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
Devendra Rajesh Kothe : పవన్ కళ్యాణ్ వల్లే గెలిచాను.. మహారాష్ట్ర ఎమ్మెల్యే కామెంట్స్ వైరల్..