కరవు సాయం : మహారాష్ట్రకు కేంద్రం మరో 2వేల కోట్లు విడుదల

మహారాష్ట్ర ప్రభుత్వానికి మరో రూ.2,160కోట్ల కరువు సాయాన్ని కేంద్రప్రభుత్వం విడుదల చేసినట్లు మంగళవారం(మే-7,2019) మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు.ఇప్పటివరకు మొత్తంగా రూ.4248.59కోట్ల కరువు సాయాన్ని కేంద్రం విడుదల చేసినట్లు ఫడ్నవీస్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
మహారాష్ట్రలోని మొత్తం 48 లోక్ సభ స్థానాలకు ఏప్రిల్-29,2019తో పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే.దీంతోరవు నిధుల విడుదలకు అనుమతించాలని, కరువు ప్రభావిత ప్రాంతాల్లో ఎలక్షన్ కోడ్ ఎత్తివేయాలని ఏప్రిల్-30,2019న ఈసీకి ఫడ్నవీస్ లేఖ రాశారు.దీనిపై స్పందించినచ ఈసీ ఎన్నికల కోడ్ నుంచి ఆయా ప్రాంతాలకు మినహాయింపు ఇచ్చింది. దీంతో కేంద్రం నిధులు విడుదల చేసింది. మహారాష్ట్రలో 151 తాలూకాలు కరవు బారిన పడ్డాయని, కరవునిధులతో బోర్లు వేసి, మంచినీటి పథకాలు, కాల్వల మరమ్మతులు చేపట్టినట్లు సీఎం తెలిపారు.నిధులు విడుదల చేసినందుకు మోడీకి ఈ సందర్భంగా సీఎం కృతజ్ఞతలు తెలిపారు.