కరోనా ఈజ్ బ్యాక్ : మహారాష్ట్రలో ఒక్కరోజే దాదాపు 16వేల కోవిడ్ కేసులు

16 Thousand New Coronavirus Cases Today Highest
Maharashtra మహారాష్ట్రలో కరోనా కేసులురోజురోజుకి రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే రాష్ట్రంలో 15,817 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో..ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఈరోజువే కావడం గమనార్హం. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 56మంది కరోనాతో చనిపోయినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.
మూడు నెలల పాటు రాష్ట్రంలో కొద్దిమేర కేసులు తగ్గగా..గత నెలలో రోజుకి 6వేల పాజిటివక కేసులో దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. అయితే,కొన్ని రోజుల్లోనే ఇప్పుడు రోజుకి కోవిడ్ కేసులు 16వేల మార్క్ ను చేరుకునే దిశగా రావడం ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఇక, మహారాష్ట్రలో కోవిడ్ కేసులు పెరుగుండటంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మహారాష్ట్రలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, కేసుల పెరుగుదలతో నాగ్‌పూర్‌లో లాక్‌డౌన్ ప్రకటన వచ్చిందని దీన్ని బట్టి ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇదే విషయమై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోందని గురువారం నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. వైరస్ ను తేలికగా తీసుకోవద్దని ఉద్దవ్ సర్కార్ కి సూచించారు. మళ్లీ వైరస్ నుంచి విముక్తి పొందాలంటే కోవిడ్- తగిన ప్రవర్తన, నియంత్రణ వ్యూహంతో పాటు వ్యాక్సిన్ లను కూడా వేయాలని పాల్ తెలిపారు. కోవిడ్ కేసులు ఎక్కువగా పెరుగుతున్న జిల్లాల్లో అర్హులైన వ్యక్తులకు టీకాలు వేయడం మరియు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. కాగా, నాగ్ పూర్‌లో మార్చి 15 నుంచి 21 వరకు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు గురువారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు.