Malaria vaccine : త్వరలో మలేరియా వ్యాక్సిన్…సీరం ఇన్‌స్టిట్యూట్ ఎండీ సైరస్ పూనావాలా వెల్లడి
మలేరియా బారిన పడుతున్న ప్రజలకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సైరస్ పూన్‌వాలా తాజాగా శుభవార్త వెల్లడించారు. మలేరియాకు వ్యాక్సిన్‌ను తమ కంపెనీ విడుదల చేయనున్నట్లు సైరస్ ప్రకటించారు....

Malaria vaccine
Malaria vaccine : మలేరియా బారిన పడుతున్న ప్రజలకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సైరస్ పూన్‌వాలా తాజాగా శుభవార్త వెల్లడించారు. మలేరియాకు వ్యాక్సిన్‌ను తమ కంపెనీ విడుదల చేయనున్నట్లు సైరస్ ప్రకటించారు. (Malaria vaccine launch soon) ఈ వ్యాక్సిన్ భారతదేశంలోనే కాకుండా మలేరియా కేసులు ఎక్కువగా ఉన్న ఆఫ్రికాలో కూడా సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు. కోవిషీల్డ్ విజయం తర్వాత ప్రపంచంలోనే మొదటిసారి మలేరియా వ్యాక్సిన్‌ను ప్రారంభించనున్నాం’’ అని పూనావాలా చెప్పారు.
CM Yogis Big Raksha Bandhan Gift : మహిళలకు సీఎం యోగి రక్షాబంధన్ కానుక
భారతదేశంలోని పలు ప్రాంతాల ప్రజలు తరచుగా మలేరియా బారిన పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. దోమల నుంచి ప్రజలకు వ్యాపించే మరో వైరల్ ఇన్‌ఫెక్షన్ డెంగ్యూకి వ్యాక్సిన్‌ను ఎస్‌ఐఐ (Serum Institute) సిద్ధం చేస్తోందని ఆయన తెలిపారు. (dengue cure in one year) డెంగ్యూ వ్యాధికి ఏడాదిలో వ్యాక్సిన్ సిద్ధమవుతుందని చెప్పారు.
Mallikarjun Kharge : ఇండియా బ్లాక్ చీఫ్‌గా మల్లికార్జున్ ఖర్గే?
మలేరియా,డెంగ్యూ రెండూ ఉష్ణమండల దేశాల్లో వ్యాపించే అవకాశం ఉన్న వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధులు. ఈ రెండు వ్యాధులకు వ్యాక్సిన్ ప్రవేశపెట్టడం ద్వారా వీటిని నిరోధించవచ్చని సైరస్ పూనావాలా చెప్పారు. కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తి తర్వాత సీరం కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను కూడా తయారు చేసింది.