Tiger Dies With cancer : క్యాన్సర్‌తో మృతి చెందిన పెద్దపులి ‘కిషన్’..కన్నీటితో వీడ్కోలు పలికిన జూ సిబ్బంది
క్యాన్సర్ బాధపడుతూ ‘కిషన్’ అనే మగ పులి మరణించింది. 13 ఏళ్లుగా దానికి క్యాన్సర్ చికిత్స చేయించినా ఫలితంలేకుండాపోయింది. ‘కిషన్’ 13 ఏళ్లుగా చికిత్స్ చేస్తున్నా ఫలితం లేకపోయింది. క్యాన్సర్ తో బాధపడుతు శుక్రవారం కన్నుమూసింది.

Male Tiger Kishan suffering from cancer dies
Male Tiger Kishan suffering from cancer dies : మనుషుల వలెనే జంతువులకు ‘క్యాన్సర్’ వస్తుంది. అలా క్యాన్సర్ బాధపడుతూ ఓ పెద్దపులి ప్రాణాలు విడిచింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని నవాబ్ వాజిద్ అలీ షా జూలాజికల్ పార్క్‌లో క్యాన్సర్‌తో బాధపడుతున్న ‘కిషన్’ అనే మగ పులి శుక్రవారం (డిసెంబర్ 30,2022) తెల్లవారుజామున మరణించింది. 13 ఏళ్లుగా దానికి క్యాన్సర్ చికిత్స చేయించినా ఫలితంలేకుండాపోయింది. ‘కిషన్’ ను 2009లో మార్చి 1న యూపీలోని కిషన్ పూర్ టైగర్ రిజర్వ్ నుండి రక్షించి లక్నోలోని జూలాజికల్ పార్కుకు తీసుకువచ్చారు.
2008 సంవత్సరంలో ‘కిషన్’ కిషన్ పూర్ టైగర్ రిజర్వ్ పరిధిలో ఉండగా స్థానికులకు చుక్కలు చూపించింది.దీంతో అటవీ వాఖ అధికారులు దీన్ని పట్టుకోవటానికి నానా తిప్పలు పడ్డారు. కొన్ని నెలలపాటు కష్టపడ్డారు. ఆఖరికి ఎట్టకేలకు దాన్ని పట్టుకుని లక్నోలోని జులాజికల్ పార్కుకు తరలించారు.
ఈ పార్కుకు తీసుకొచ్చిన సమయంలో కిషన్ ఆరోగ్యం గురించి నిపుణులు పరీక్షలు చేయగా దానికి ‘హేమాంగియోసార్కోనోమా అనే క్యాన్సర్’ సోకినట్లుగా గుర్తించారు. క్యాన్సర్ తో బాధపడుతుండటం వల్ల అడవి జంతువులను వేటాడే సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో స్థానికంగా ఉండే మనుషులపై దాడి చేయటం చేసేది. ఈ క్రమంలోనే దాన్ని పట్టుకుని లక్కో పార్కుకు తరలించారు. ఈ జూకు వచ్చినప్పటినుంచి క్యాన్సర్ తో బాధపడే కిషన్ కు జూ అధికారులు చికిత్స ప్రారంభించారు. అలా 13 ఏళ్లుగా దానికి చికిత్సనందించారు. ఓ పక్క వృద్ధాప్యం మరోపక్క క్యాన్సర్ తినేస్తున్న దుర్భర పరిస్థితుల్లో పాపం ‘కిషన్’ చాలా బాధపడేది. ఈ క్యాన్సర్ దాని శరీరాన్ని తినేస్తు వచ్చింది. వృద్దాప్యం వల్ల కవాచ్చు దానికి చికిత్స ఏమాత్రం పనిచేయలేదు. అలా ఆ క్యాన్స్ పులి చెవి, నోటి వరకు వ్యాపించి ఆహారం కూడా తినలేని పరిస్థితి ఏర్పడింది.
పులి కిషన్ జూలాజికల్ పార్క్ లక్నోలో 13 సంవత్సరాలకు పైగా నివసిస్తోంది. క్యాన్స్ చికిత్స కొనసాగుతునే ఉంది. అలా కాలం గడిచేకొద్దీ కిషన్ వయసు పైబడినా, క్యాన్సర్‌తో బాధపడుతున్నా సాధారణ పులిలా ప్రవర్తిస్తూండేది. అది కిషన్ సామర్థ్యం అని అనుకునేవారు జూ సిబ్బంది. అలా క్యాన్సర్ ముదిరిపోయి చివరి రోజుల్లో కిషన్ ఆహారం తినటం పూర్తిగా మానేసింది. దీంతో కదలికలను కూడా తగ్గిపోయాయి. క్యాన్సర్‌తో బాధపడుతూ 13 ఏళ్ల తర్వాత కిషన్ శుక్రవారం మరణించింది కిషన్.
పార్క్ డైరెక్టర్ వీకే మిశ్రా, వన్యప్రాణి డాక్టర్, జూలాజికల్ పార్క్ సిబ్బంది ఈ మగపులికి జూ సిబ్బంది ఉద్వేగంగా చివరి వీడ్కోలు పలికారు. కాగా ఈ పార్కులోనే కిషన్ తో పాటు ఉండే మరో ఆడపులి కజ్రీ ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు.ప్రస్తుతం జూలాజికల్ పార్క్‌లో ఆహారం తీసుకుంటున్నా వృద్ధాప్యం కారణంగా కజ్రీ పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని చలి నుంచి కాపాడేందుకు హీటర్లు తదితర ఏర్పాట్లు కూడా చేశామని పార్క్ డైరెక్టు మిశ్రా తెలిపారు.