Longest Tongue : వామ్మో… ఎంత పొడవుగా ఉందో.. చూస్తే హడలిపోవాల్సిందే
అవును... అతడి నాలుక చూస్తే వామ్మో అనాల్సిందే. ఇది నిజమేనా అనే అనుమానం కలగక మానదు. అంత పొడవుగా ఉంటుంది మరి. నాలుక పొడవుగా ఉండటమే కాదు, దాంతో అతడు చేసే పనులు చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.

Longest Tongue
Longest Tongue : అవును… అతడి నాలుక చూస్తే వామ్మో అనాల్సిందే. ఇది నిజమేనా అనే అనుమానం కలగక మానదు. అంత పొడవుగా ఉంటుంది మరి. నాలుక పొడవుగా ఉండటమే కాదు, దాంతో అతడు చేసే పనులు చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. నాలుకతో తన ముక్కును అందుకుంటాడు. అంతేనా నాలుకతో నోటి లోపల ఉన్న చిన్న నాలుకను అందుకుంటాడు. అంతేకాదు నాలుకను పూర్తిగా మడత కూడా పెడతాడు. నమ్మబుద్ధి కావడం లేదు కదూ. అయితే మీరు తప్పకుండా ఈ వీడియో చూడాల్సిందే.
అతడి పేరు కె. ప్రవీణ్ కుమార్. వయసు 20ఏళ్లు. తమిళనాడు రాష్ట్రం విరుధునగర్‌లోని తిరుదంగల్ లో ఉంటాడు. తన పొడవైన ‘నాలుక’తో ప్రవీణ్ వార్తల్లోకెక్కాడు. దేశంలోనే అతి పొడవైన నాలుక ఉన్న వ్యక్తిగా రికార్డు సాధించాడు. సాధారణ వ్యక్తికి ఉండాల్సిన సైజు కంటే పొడవుగా ఉండటంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా పురుషుల నాలుక 8.5 సెంటీ మీటర్లు, మహిళల నాలుక 7.9 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. అయితే, ప్రవీణ్ నాలుక మాత్రం అందరి కంటే పొడవుగా 10.8 సెంటీమీటర్ల(4.25 ఇంచులు) పొడవుంది.
బీఈ రోబోటిక్స్ చదువుతున్న ప్రవీణ్ గతేడాది ఆసియా బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం పొందాడు. తన నాలుకతో ముక్కును ఒక్క నిమిషంలో 219 సార్లు తాకాడు. అంతేకాదు.. తన నాలుకతో కంటిని సైతం అందుకోడానికి ప్రయత్నించాడు. ఏదో ఒక రోజు తన నాలుకతో కనుపాపలను తాకగలననే నమ్మకాన్ని ప్రవీణ్ వ్యక్తం చేస్తున్నాడు. అయితే, పొడవైన నాలుక వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపాడు.
గిన్నీస్ వరల్డ్ రికార్డుల ప్రకారం.. ప్రస్తుతం ఈ రికార్డు కాలిఫోర్నియా సలినాస్‌లోని నిక్ స్టోబెర్ల్ అనే వ్యక్తి పేరు మీదుంది. 2012లో నమోదైన రికార్డు ప్రకారం అతడి నాలుక 10.1 సెంటీమీటర్లు పొడవుంది. పురుషుల విభాగంలో ప్రపంచంలోనే అతి పొడవైన నాలుకగా అతడి పేరు నమోదైంది. అతడి నాలుకతో పోల్చితే ప్రవీణ్‌దే పొడవైనది. కాబట్టి.. అతడి రికార్డును ప్రవీణ్ బ్రేక్ చేసే అవకాశం ఉంది.
”నా నాలుక పొడవు చూసి నా స్నేహితులు నన్ను ఆటపట్టించే వారు. కానీ, ఆ నాలుకతో నేను సాధించిన ఘనతలు చూసి వారు నన్ను ఆటపట్టించడం మానేశారు. నేను రికార్డులు నమోదు చేయకముందు నా స్నేహితులు కనీసం నన్ను మనిషిగా కూడా చూడలేదు. నాలుకతో ముక్కుని తాకడం, నాలుకతో పెయింటింగ్ వేయడం పెద్ద గొప్ప విషయం ఏమీ కాదని నా స్నేహితులు టీజ్ చేసేవారు. నా దగ్గరి వాళ్లు కూడా నన్ను ఎగతాళి చేసేవారు. అయినా నేను అవేమీ పట్టించుకోలేదు. రికార్డులు సెట్ చేసుకుంటూ వెళ్లాను. ఇప్పుడు నేను సాధించిన రికార్డులు, ఘనతలు చూశాక వారంతా నన్ను టీజ్ చేయడం ఆపేశారు. ఇప్పుడు వరల్డ్ రికార్డు సెట్ చేయడం మరిన్ని ఎత్తులు అందుకోవడం నా లక్ష్యం” అని ప్రవీణ్ చెప్పారు.
”చిన్నప్పటి నుంచే తన నాలుకతో తన ముక్కుని అందుకునే వాడు. అంతేకాదు తన నాలుకని దాచే వాడు కూడా. అది చూసి నేను భయపడ్డాను. అలా నాలుక మడిస్తే అది ఇరుక్కుపోతుంది కదా అప్పుడేం చేస్తావ్ అని అడిగారు. అలా ఏమీ జరగదని చెప్పాడు. ఆ తర్వాత అతడు చేసే పని చూసి అంతా ఆశ్చర్యపోయారు. ప్రవీణ్ స్నేహితులు, బంధులవులు ప్రవీణ్ తన నాలుకతో చేసే పనులు చూసి ఎంజాయ్ చేశారు ” అని ప్రవీణ్ తల్లి కమల ఎంతో ఆనందంగా చెప్పారు.
నాలుకతో ప్రవీణ్ సాధించిన ఘనతలు..
* పెయింటింగ్స్ గీస్తాడు
* నాలుక ద్వారా పెయింట్ బ్రష్ సాయంతో రాయగలడు, పెయింట్ వేయగలడు
* ఒక నిమిషంలో 219 సార్లు తన నాలుకతో తనన ముక్కుని టచ్ చేస్తాడు(ఆసియా రికార్డు)