Tripura CM Manik Saha: త్రిపురలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం.. రెండోసారి సీఎంగా మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం ..

త్రిపురలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బీజేపీ నేత డాక్టర్ మాణిక్ సాహా త్రిపుర సీఎంగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం అగర్తలాలోని వివేకానంద మైదానంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది.

Tripura CM Manik Saha: త్రిపురలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం.. రెండోసారి సీఎంగా మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం ..

tripura CM

Updated On : March 8, 2023 / 12:04 PM IST

Tripura CM Manik Saha: ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బీజేపీ నేత డాక్టర్ మాణిక్ సాహా త్రిపుర సీఎంగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం అగర్తలాలోని వివేకానంద మైదానంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన పలువురు సీఎంలు హాజరయ్యారు. సాహాతో పాటు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు.

Nagaland: నాగాలాండ్‌లో ప్రతిపక్షం లేని ప్రభుత్వం.. అన్నిపార్టీలు మద్దతిచ్చాయి..!

త్రిపుర రాష్ట్ర 12వ సీఎంగా మాణిక్ సాహాతో గవర్నర్ ఎస్ఎన్ ఆర్య ప్రమాణం చేయించారు. ఎమ్మెల్యేలు రతన్ లాల్ నాథ్, సంతాన డాడ్జ్, సుశాంత చౌదరి, టింకూ రాయ్, ప్రణజిత్ సింఘారాయ్, బికాష్ దెబ్బర్మ, సుధాంగ్సుదాస్, శుక్లా చరణ్ నోటియా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. వీరిలో ముగ్గురు కొత్త మంత్రులు. బీజేపీ మిత్రపక్షమైన ఐపీఎఫ్‌టీ కి మంత్రి పదవి లభించింది. ఆ పార్టీ నుంచి శుక్లా చరణ్ నోటియా మంత్రిగా ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని త్రిపురలోని కాంగ్రెస్, వామపక్షపార్టీలుబ హిష్కరించాయి.

Meghalaya CM Conrad Sangma: మేఘాలయ సీఎంగా సంగ్మా ప్రమాణ స్వీకారం.. హాజరైన ప్రధాని మోదీ, అమిత్ షా

గత నెల ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈనెల 2న మూడు రాష్ట్రాల ఫలితాలు వెలువడ్డాయి. మంగళవారం మేఘాలయ సీఎంగా నేషనల్ పీపుల్స్ పార్టీ అధినేత కాన్రాడ్ సంగ్మా రెండోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. నాగాలాండ్ సీఎంగా ఎన్డీపీపీ అధినేత నెప్యూ రియో ఐదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రెండు రాష్ట్రాల సీఎం ప్రమాణ స్వీకారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు పాల్గొన్నారు. బుధవారం త్రిపురలో జరిగిన సీఎం మాణిక్ స్వాహా ప్రమాణ స్వీకారంలోనూ ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలు పాల్గొన్నారు.