కోడ్ ఉల్లంఘనపై ఢిల్లీ డిప్యూటీ సీఎంకు ఈసీ నోటీసు

  • Published By: venkaiahnaidu ,Published On : May 8, 2019 / 02:34 AM IST
కోడ్ ఉల్లంఘనపై ఢిల్లీ డిప్యూటీ సీఎంకు ఈసీ నోటీసు

Updated On : May 8, 2019 / 2:34 AM IST

ఎన్నికల కోడ్ నియమావళి ఉల్లంఘనపై తూర్పు ఢిల్లీ రిటర్నింగ్ అధికారి(RO)మంగళవారం(మే-7,2019) ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు నోటీసు జారీ చేశారు.తూర్పు ఢిల్లీ నుంచి ఆప్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అతిషి  క్షత్రియ కులం గురించి ఉద్దేశిస్తూ ఏప్రిల్-27,2019న సిసోడియా చేసిన ట్వీట్ కు గాను ఆయన ఈ నోటీసు జారీ చేశారు.అతిషి కులం గురించి బీజేపీ,కాంగ్రెస్ అబద్దాలాడుతుందంటూ కౌంటర్ గా సిసోడియా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

సిసోడియా వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆర్ పీ సింగ్,ఆర్తి మెహ్రా,సుభాష్ సచ్ దేవలు చేసిన కంప్లెంట్ ను మే-3,2019న ఢిల్లీ సీఈవో ఆఫీస్ కు ఫార్వార్డ్ చేసినట్లు  తూర్పు ఢిల్లీ ఆర్వో కే.మహేష్ తెలిపారు. బుధవారం సాయంత్రంలోగా  సిసోడియా తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా ఈసీ ఆదేశించింది.