ఇది ఇండియన్ ఆర్మీ అంటే, ఉగ్రవాది మనస్సు మార్చిన జవాన్లు

  • Published By: madhu ,Published On : October 17, 2020 / 09:55 AM IST
ఇది ఇండియన్ ఆర్మీ అంటే, ఉగ్రవాది మనస్సు మార్చిన జవాన్లు

Updated On : October 17, 2020 / 10:42 AM IST

Missing SPO : ఉగ్రవాది మనస్సు మార్చారు ఇండియన్ ఆర్మీ జవాన్లు. ఉగ్రవాదం మంచిది కాదు..లొంగిపోవాలని, ఎవరూ ఏమీ చేయరని ఆర్మీ భరోసా ఇచ్చింది. అతని చేతిలో ఏకే 47 ఉన్నా..జవాన్లు, తండ్రి చెబుతున్న మాటలు నమ్మకం కలిగించాయి. వెంటనే ఏకే 47 రైఫిల్ ను పక్కన పడేసి లొంగిపోయాడు. అతని జవాన్లు ఏమీ చేయకుండా..నీళ్లు ఇచ్చి.. కుటుంబసభ్యులకు అప్పచెప్పారు. భావోద్వేగంతో కూడుకున్న ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.



జమ్మూ కాశ్మీర్ లో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ రెండు ఏకే 47 తుపాకులతో కనిపించకుండా పోయాడు. అదే సమయంలో..చదూరా ఏరియాలో జహంగీర్ భట్ యువకుడు కూడా మిస్సింగ్ అయ్యాడు. అప్పటి నుంచి కుటుంబసభ్యులు గాలిస్తున్నారు. అయితే..శుక్రవారం ఉగ్రవాదులను ఏరివేసే ఆపరేషన్ జరుగుతోంది. ఓ ప్రాంతంలో ఉగ్రవాదులున్నట్లు గుర్తించారు. వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.



దాక్కున్న వ్యక్తి జహంగీర్ గా గుర్తించారు. ఈ విషయాన్ని తండ్రికి తెలియచేసి..ఘటనాస్థలికి రావాలని సూచించారు. లొంగిపోవాలని జవాన్లు సూచించారు. ఏమీ కాదు..ఎవరూ కాల్చరు..అని జవాన్లు హామీనిచ్చారు. తండ్రి, జవాన్లు చెబుతున్న మాటలతో జహంగీర్ మనస్సు మార్చుకున్నాడు. మెల్లిగా..పొదల చాటునుంచి బయటకు వచ్చాడు.



ఎవరూ ఏమీ చేయవద్దని, కాల్చొద్దని జవాన్లు సూచించారు. జహంగీర్ కు నీళ్లిచ్చి..తండ్రితో మాట్లాడించారు. తండ్రిని కౌగిలించుకున్నాడు జహంగీర్. తన కొడును ఉగ్రవాదం ఉచ్చు నుంచి కాపాడిన సైనికులకు జహంగీర్ తండ్రి ధన్యవాదాలు తెలియచేశాడు.