చిదంబరం అరెస్ట్…రాజకీయ కక్ష సాధింపేనన్న స్టాలిన్

  • Published By: venkaiahnaidu ,Published On : August 22, 2019 / 10:05 AM IST
చిదంబరం అరెస్ట్…రాజకీయ కక్ష సాధింపేనన్న స్టాలిన్

Updated On : August 22, 2019 / 10:05 AM IST

INX మీడియా వ్యవహారం కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు చిదంబరంను నిన్న రాత్రి నాటకీయ పరిణామాల మధ్య సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చిదంబరం అరెస్టుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ మాట్లాడుతూ.. చిదంబరం నివాసం వద్ద సీబీఐ అధికారులు ఆయనను అరెస్టు చేసేందుకు గోడ దూకి వెళ్లారు. ఇలా చేయడం దేశానికే సిగ్గు చేటు. రాజకీయ విద్వేషంతోను చిదంబరంను అరెస్టు చేశారు. ముందస్తు బెయిల్‌ కోరినప్పటికీ ఆయనకు బెయిల్‌ రాకుండా చేసి అరెస్టు చేయడం అన్యాయం. చిదంబరం అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని స్టాలిన్‌ అన్నారు. 

రెండు రోజుల అజ్ణాతాన్ని వీడి నిన్న రాత్రి ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధానకార్యాలయంలో చిదంబరం సబెన్ గా ప్రత్యక్ష్యమైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ కార్యాలయంలో ప్రెస్ మీట్ తర్వాత సీబీఐ అధికారులు కాంగ్రెస్ ఆఫీస్ కు వచ్చేలోపు ఆయన అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయారు. అయితే చిదంబరం ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులు సెక్యూరిటీ సిబ్బంది లోనికి రానివ్వకపోవడంతో గోడ దూకి వెళ్లి మరీ ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.