పోలింగ్ బూత్ లో ఫొటోలు : కోడ్ ఉల్లంఘించిన ఎమ్మెల్యే 

ఉత్తరాఖండ్, బదిరినాథ్ నియోజకవర్గపు బీజేపీ ఎమ్మెల్యే మహేంద్ర భట్ ఎన్నికల మోడల్ కోడ్ కండక్ట్ (MCC)ను ఉల్లంఘించారు.

  • Published By: sreehari ,Published On : April 11, 2019 / 11:01 AM IST
పోలింగ్ బూత్ లో ఫొటోలు : కోడ్ ఉల్లంఘించిన ఎమ్మెల్యే 

Updated On : April 11, 2019 / 11:01 AM IST

ఉత్తరాఖండ్, బదిరినాథ్ నియోజకవర్గపు బీజేపీ ఎమ్మెల్యే మహేంద్ర భట్ ఎన్నికల మోడల్ కోడ్ కండక్ట్ (MCC)ను ఉల్లంఘించారు.

బదిరినాథ్ (ఉత్తరాఖండ్) : ఉత్తరాఖండ్, బదిరినాథ్ నియోజకవర్గపు బీజేపీ ఎమ్మెల్యే మహేంద్ర భట్ ఎన్నికల మోడల్ కోడ్ కండక్ట్ (MCC)ను ఉల్లంఘించారు. గురువారం (ఏప్రిల్ 11, 2019)లోక్ సభ తొలి దశ ఎన్నికల పోలింగ్ లో భాగంగా బదిరినాథ్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే భట్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా పోలింగ్ బూత్ లో ఓటు వేసిన అనంతరం ఆయన మొబైల్ ఫోన్ లో ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈసీ ఎంసీసీ నిబంధనల ప్రకారం.. పోలింగ్ బూత్ లోకి మొబైల్ ఫోన్లు తీసుకువెళ్లడం, ఫొటోలు దిగడానికి అనుమతి లేదు.

ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది. దీంతో భట్ పై ఈసీ చర్యలు తీసుకోవాల్సిందిగా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఉత్తరాఖండ్ లో తొలి దశ ఎన్నికల్లో భాగంగా ఐదు లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మే 23న ఉత్తరాఖండ్ పోలింగ్ ఓట్లను లెక్కించి ఫలితాలను విడుదల చేయనున్నారు. మహేంద్ర భట్.. బదిరినాథ్ నుంచి ఫిబ్రవరి 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు.