రాజ్యసభకు అభినందనలు తెలిపిన ప్రధాని

రాజ్యసభ 250వ సెషన్ జరుపుకుంటున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడిన ఆయన పలు అంశాలను ప్రస్తావిస్తూ రాజ్యసభను ప్రసంశించారు. ఇలాంటి సభలో ఉన్నందుకు గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. రాజ్యసభ మనలోని భావాలను తెలిపేందుకు ఎన్నో సంచలనాత్మక నిర్ణఉయాలు తీసుకునేందుకు వేదికగా మారింది. ప్రజాపయోగం ఉన్న ఎన్నో చట్టాలు చేయడానికి కేంద్రానికి సహకరించింది.
2013ఎన్డీఏ ప్రభుత్వంలో వాజ్ పేయి అధికారంలో ఉన్నప్పుడు ఇదే వేదికగా రాజ్యసభ సెకండ్ హౌజ్ కానీ, రెండో స్థానంలో ఉండేది కాదని అన్నారని గుర్తు చేశారు. భారత్‌లో ఉన్న రాజ్యసభలో భిన్నత్వంలో ఏకత్వం ప్రతిబింబిస్తుంది. రాజ్యసభ ఎన్నో చారిత్రక నిర్ణయాలు తీసుకుంది. అంబేద్కర్ కూడా రాజ్యసభలో పనిచేశారు.
ఉభయసభలూ చరిత్ర సృష్టించాయి. కాలంతో పాటు మారేందుకు రాజ్యసభ కృషి చేసింది. దేశమేధో సంపత్తికి రాజ్యసభ నిదర్శనంగా నిలిచింది. రాజ్యసభ వల్లే వన్ నేషన్, వన్ ట్యాక్స్ అమల్లోకి వచ్చాయి. 250వ సెషన్ కు హాజరైన ఎంపీలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ప్రధాని.