ప్లీజ్ మోడీజి…జపాన్ నౌకలోని భారతీయుల వీడియో మెసేజ్

  • Published By: venkaiahnaidu ,Published On : February 10, 2020 / 03:54 PM IST
ప్లీజ్ మోడీజి…జపాన్ నౌకలోని భారతీయుల వీడియో మెసేజ్

Updated On : February 10, 2020 / 3:54 PM IST

జపాన్ దగ్గరలోని యోకోహోమా పోర్టు దగ్గర ఫిబ్రవరి-3,2020నుంచి నిలిచి ఉన్న డైమండ్ ప్రిన్సెస్‌ లో నౌకలో 160మంది భార‌తీయులు ఉన్న విష‌యం తెలిసిందే.  క‌రోనా వైర‌స్ సోకిన వ్య‌క్తులు ఆ నౌక‌లో ఉన్నందున  ఆ నౌక‌ను క్వారెంటైన్ చేశారు. అయితే దాంట్లో ఉన్న అయిదుగురు భార‌తీయ సిబ్బంది మొఖానికి మాస్క్ లు ధరించి ఇవాళ వీడియో ద్వారా ఓ మెసేజ్ పంపారు.  కిచ‌న్ స్టాఫ్‌గా ప‌నిచేస్తున్న వారు.. త‌మ‌ను ఆదుకోవాలంటూ వేడుకున్నారు.  

బెంగాల్‌కు చెందిన బిన‌య్ కుమార్ స‌ర్కార్ ఆ వీడియోలో చేతులు జోడించి త‌మ‌ను ర‌క్షించాలంటూ కోరారు. ఎవ‌రూ త‌మ‌కు క‌రోనా ప‌రీక్ష‌లు చెక్ చేయ‌లేద‌ని,  మ‌మ్ముల్ని విడిపించండి అంటూ భార‌తీయ‌ సిబ్బంది  ప్ర‌ధాని మోడీతో పాటు ఐక్య‌రాజ్య‌స‌మితిని అభ్య‌ర్థించారు.దయచేసి వీలైనంత త్వరగా తమను కాపాడాలని,తమకు ఏదైనా జరిగితే విషయం ఏంటని అన్నారు. దయచేసి తమను రక్షించి తాము ఇంటికి సేఫ్ గా తిరిగితీసుకెళ్లాలని భారత ప్రభుత్వాన్ని,మోడీని కోరుతున్నామన్నారు.

షిప్‌లో మొత్తం 3,700 మంది ప్ర‌యాణికులు ఉన్నారు. షిప్‌లో ఉన్న 130మందికి కరోనా సోకిన‌ట్లు నిర్ధార‌ణ అయ్యింది.హాంగ్‌కాంగ్‌కు చెందిన ఓ ప్ర‌యాణికుడు మొద‌ట క‌రోనా  ప‌రీక్ష‌లో పాజిటివ్‌గా తేలాడు. ఆ షిప్‌లో మొత్తం 160 మంది భార‌తీయులు ఉన్నారు. అయితే వ‌ర‌ల్డ్ డ్రీమ్ అనే మ‌రో నౌక‌లో ఉన్న సిబ్బంది, ప్ర‌యాణికులు మాత్రం ఇటీవ‌ల విడుద‌ల చేశారు.