Modi Like Avatar: మోదీ అవతార పురుషుడు, మరణించే వరకు ఆయనే ప్రధాని.. యూపీ మంత్రి

2014లో ఐదేళ్లు అవకాశం ఇవ్వండి చాలు అంటూ అధికారంలోకి వచ్చిన మోదీ.. 2019 ఎన్నికల ప్రచారంలో.. దేశ సేవపై తనకు వ్యామోహం తీరలేదని, వీలైనంత ఎక్కువ కాలం ప్రధానిగా ఉంటానంటూ పరోక్షంగా తన మనసులోని కోరికను మోదీ వెల్లడించారు.

Modi Like Avatar: మోదీ అవతార పురుషుడు, మరణించే వరకు ఆయనే ప్రధాని.. యూపీ మంత్రి

Modi like avatar of god says UP minister

Updated On : October 26, 2022 / 9:56 PM IST

Modi Like Avatar: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవతార పురుషుడని, ఆయన కోరుకుంటే మరణించేంత వరకు తానే ఈ దేశ ప్రధానమంత్రిగా ఉంటారని ఉత్తరప్రదేశ్ మంత్రి గులాబ్ దేవి అన్నారు. బుధవారం మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి ఎవరైనా ప్రధానమంత్రి అవుతారా అని విపక్ష నేతలు అడిగిన ఆమె ఈ విధంగా సమాధానం చెప్పారు. ‘‘మోదీ అవతార పురుషుడు లాంటి వాడు. చాలా అద్భుతమైన జ్ణానం ఉన్న వ్యక్తి ఆయన. ఆయనకు పోటీ ఎవరూ ఉండరు. ఒకవేళ ఆయన అనకుంటే, ఆయన మరణం వరకు ఆయనే ఈ దేశ ప్రధానమంత్రిగా ఉంటారు’’ అని గులాబ్ దేవి అన్నారు. అంతే కాకుండా, దేశం మొత్తం ఆయన చెప్పే మాటల్ని ఆచరిస్తోందని, ఒక వ్యక్తి గొప్పతనానికి అంతకంటే ఉదహారణ ఏం కావాలని ఆమె ప్రశ్నించారు.

ప్రధాని మోదీకి ఇలాంటి పొగడ్తలు కొత్తేం కాదు. గతంలో ఆయనను మహానుభావులతో, పురాణ పురుషులతో పోలుస్తూ అనేక మంది పొగడ్తలు కురిపించారు. సందర్భం వచ్చినప్పుడుల్లా బీజేపీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. వాస్తవానికి 2014లో ఐదేళ్లు అవకాశం ఇవ్వండి చాలు అంటూ అధికారంలోకి వచ్చిన మోదీ.. 2019 ఎన్నికల ప్రచారంలో.. దేశ సేవపై తనకు వ్యామోహం తీరలేదని, వీలైనంత ఎక్కువ కాలం ప్రధానిగా ఉంటానంటూ పరోక్షంగా తన మనసులోని కోరికను మోదీ వెల్లడించారు.

CM Jagan Target Tekkali : టార్గెట్ టెక్కలి.. అచ్చెన్నాయుడు నియోజకవర్గంపై సీఎం జగన్ సమీక్ష, కచ్చితంగా గెలవాలని ఆదేశం