Monkey-Chicken : క్యూట్ కోడిపిల్లతో కోతిపిల్ల ఆటలు.. హత్తుకుని తెగ ముద్దులు పెట్టేస్తోంది!

మనుషుల్లో చూపించే ప్రేమ కంటే.. జంతువులే ఎంతో దయ కలిగి ఉంటాయనడానికి ఇదే నిదర్శనం.. ఓ బుజ్జి కోతి పిల్ల.. చిన్న కోడిపిల్లతో స్నేహం చేస్తోంది. అరటి ఆకుపై చక్కగా కూర్చొని.. కోడిపిల్లను ముద్దు చేస్తోంది.

Monkey-Chicken : క్యూట్ కోడిపిల్లతో కోతిపిల్ల ఆటలు.. హత్తుకుని తెగ ముద్దులు పెట్టేస్తోంది!

Monkey Calms Down Little Chicken

Updated On : June 29, 2021 / 12:45 PM IST

Monkey little chicken with a kiss : మనుషుల్లో చూపించే ప్రేమ కంటే.. జంతువులే ఎంతో దయ కలిగి ఉంటాయనడానికి ఇదే నిదర్శనం.. ఓ బుజ్జి కోతి పిల్ల.. చిన్న కోడిపిల్లతో స్నేహం చేస్తోంది. అరటి ఆకుపై చక్కగా కూర్చొని.. కోడిపిల్లను ముద్దు చేస్తోంది. భయంతో అది వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తుంటే.. దాన్ని తన చేతితో గట్టిగా వెనక్కి లాగేసి ఒడిలోనే కూర్చొబెట్టుకుంది. ఎక్కడికి వెళ్తావ్.. ఇద్దరం ఆడుకుందామా.. అంటూ ముద్దులు పెడుతోంది క్యూట్ కోతిపిల్ల..

ఈ వీడియోను సోషల్ మీడియాలో IFS అధికారి సుశాంత నంద ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది. సెక్లన నిడివి గల ఈ వీడియోలో వెళ్లిపోయేందుకు ప్రయత్నాలు చేస్తుంటే.. కోతిపిల్ల దాన్ని వెనక్కి లాగి హత్తుకుని ముద్దులు పెట్టడం కనిపిస్తుంది.


వీడియోను చూసిన ఎవరికైనా ముఖంలో చిరునవ్వు రాక మానదు.. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఇప్పటివరకూ 7.6 వేల వ్యూస్ దాటేశాయి.