హనుమంతుడే కోతి రూపంలో వచ్చి ఓదార్చాడా?

  • Published By: vamsi ,Published On : April 20, 2019 / 08:25 AM IST
హనుమంతుడే కోతి రూపంలో వచ్చి ఓదార్చాడా?

Updated On : April 20, 2019 / 8:25 AM IST

ఎవరైనా మనిషి చనిపోతే వారి ఇంటికి వెళ్లి ఓదార్చడం చూస్తూనే ఉంటాం. అయితే చనిపోయన వ్యక్తి ఇంటికి వచ్చిన కోతి వారి బంధువులను ఓదార్చడం జరిగింది. ఇప్పడు నెట్టింట్లో కోతి ఓదార్పు వీడియో వైరల్ అయింది. అసలు విషయం ఏమిటంటే కర్ణాటకలో ఓ కోతి.. చావింటికి వెళ్లి బంధువులను ఓదార్చింది.

వినడానికి వింతగా ఉన్న ఇది వాస్తవం. హనుమాన్ జయంతి రోజైన శుక్రవారం(19 ఏప్రిల్ 2019) కర్ణాటకలోని నార్గుండ్‌లో ఓ 80 ఏళ్ల వృద్ధుడు చనిపోయాడు. దాంతో అతని బంధువులంతా ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలుపుతున్నారు.
అదే సమయంలో అనుకోని అతిథిలా వచ్చిన ఒక కోతి కూడా అక్కడకు వచ్చి ఏడుస్తున్న మహిళ దగ్గరకు వెళ్లి భుజం మీద చెయ్యి పెట్టి తల నిమిరి ఓదార్చింది.

ఈ సంఘటనతో అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి గురవగా.. హనుమాన్‌ జయంతి రోజు స్వయంగా ఆ హనుమంతుడే వచ్చి ఓదార్చడంటూ నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అయితే మనిషి ఓదార్చినట్లే కోతి ఓదార్చడం కాస్త వింతగానే ఉంది. అయితే కోతి గతంలో కూడా గట్టిగా ఏడుస్తున్న శబ్దం వినపడితే అక్కడ ప్రత్యక్షమై ఓదార్చేది అని స్థానికులు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే చావింటికి కోతి వచ్చిందని అంటున్నారు. అయితే హనుమాన్ జయంతి రోజే కోతి రావడంతో హనుమంతుడే కోతి రూపంలో వచ్చి ఓదార్చాడా? అనే అనుమానంమ వ్యక్తం చేస్తున్నారు.