Monkey In Metro Rail : ఢిల్లీ మెట్రోలో ప్రయాణించి హల్‌చల్ చేసిన కోతి

ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణం చేసి  ఒక కోతి హల్ చల్ చేసింది. అందుకు సంబంధించిన వీడియో శనివారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Monkey In Metro Rail : ఢిల్లీ మెట్రోలో ప్రయాణించి హల్‌చల్ చేసిన కోతి

Monkey Travel In Delhi Metro Rail Viral Video Stun People

Updated On : June 20, 2021 / 11:58 AM IST

Monkey In Metro rail : ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణం చేసి  ఒక కోతి హల్ చల్ చేసింది. అందుకు సంబంధించిన వీడియో శనివారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈవిషయాన్ని ఢిల్లీ మెట్రో అధికారులు ధృవీకరించలేదు. ఏస్టేషన్ లో ఎక్కి, ఏ టైమ్ లో, ఏబోగీలో, ప్రయాణించిందో వివరాలు తెలపాలని వారు నెటిజన్లను కోరారు.

మెట్రో కోచ్ లోకి వచ్చిన కోతి కాసేపు అల్లరిగా తిరుగుతూ, చివరికి ఒక సీటు లో ప్రయాణికుడి పక్కన కూర్చుంది. కోచ్ లో వినిపించిన మాటల ప్రకారం  కోతి ఢిల్లీలో యమునా బ్యాంక్ స్టేషన్ ప్రాతంలో ప్రయాణించినట్లు తెలుస్తోంది.