మే 15వరకు అవన్నీ క్లోజ్, కేంద్రం మరో కీలక నిర్ణయం

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కరోనా కట్టడికి చర్యలు చేపట్టింది. ఇప్పటికే పరీక్షలు రద్దు చేసిన కేంద్రం తాజాగా మరో డెసిషన్ తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న చారిత్రక కట్టడాలు, స్మారక స్థలాలు, మ్యూజియంలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు గురువారం(ఏప్రిల్ 15,2021) ప్రకటించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ASI) స్పష్టం చేసింది.

మే 15వరకు అవన్నీ క్లోజ్, కేంద్రం మరో కీలక నిర్ణయం

Monuments, Museums Closed

Updated On : April 15, 2021 / 11:16 PM IST

Monuments, Museums Closed : దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కరోనా కట్టడికి చర్యలు చేపట్టింది. ఇప్పటికే పరీక్షలు రద్దు చేసిన కేంద్రం తాజాగా మరో డెసిషన్ తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న చారిత్రక కట్టడాలు, స్మారక స్థలాలు, మ్యూజియంలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు గురువారం(ఏప్రిల్ 15,2021) ప్రకటించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ASI) స్పష్టం చేసింది.

కేంద్ర ప్రభుత్వ సంరక్షణలో ఉండే స్మారక కట్టడాలు, స్థలాలు, మ్యూజియంలను మే 15 వరకు మూసివేస్తున్నట్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తాజ్ మహల్, ఫతే పూర్ సిక్రి, హుమయూన్స్ టూంబ్ తదితర కట్టడాల సందర్శనకు అనుమతి లేదన్నారు. గత సంవత్సరం(2020) కూడా కరోనా కేసులు భారీగా నమోదవుతున్న వేళ ఈ కట్టడాలన్నీ మూసివేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వైరస్ కాస్త తగ్గుముఖం పట్టడంతో క్రమంగా ఆంక్షలు ఎత్తివేశారు. తాజాగా, గతంలో కంటే ఎక్కువగా కరోనా కొత్త కేసులు నమోదవుతుండటంతో మరోసారి ఆంక్షలు అమలు చేస్తున్నారు.

బుధవారం(ఏప్రిల్ 14,2021) ఒక్కరోజే దేశంలో 2 లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు, వెయ్యికిపైగా మరణాలు నమోదు కావడం భయాందోళనకు గురిచేస్తోంది. సెకండ్ వేవ్ లో కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. కరోనా కట్టడి కోసం కేంద్రంతోపాటు పలు రాష్ట్రాలు కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నాయి.

దేశంలో 3వేల 691 స్మారక కట్టడాలను ఏఎస్ఐ పర్యవేక్షిస్తుంది. వాటిలో 143 స్మారక కట్టడాలు సందర్శనకు అనుమతి ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 170 చారిత్రక కట్టడాలు ఉన్నాయి. అందులో కేవలం 13 కట్టడాలకు మాత్రమే సందర్శనకు అనుమతి ఉంది. వాటిలో Red Fort, Humayun’s Tomb, Qutub Minar, Safdar Jung’s Tomb, Purana Quila, and Hauz Khas టికెట్లు ఇచ్చి సందర్శనకు అనుమతి ఇస్తారు. Red Fort, Qutub Minar, and Humayun’s Tomb ఎక్కువమంది సందర్శిస్తారు. ప్రతి రోజూ సుమారు 10వేల మంది సందర్శకులు వస్తారు.