గూగుల్ లో ఏం జరుగుతుంది : సుందర్ పిచాయ్‌పై ఉద్యోగుల్లో తగ్గిన నమ్మకం

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పని తీరుపై అతని సహోద్యోగులే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నెట్ ట్రెండ్ నడుస్తున్న జనరేషన్‌లో అధిక లాభార్జన చేస్తున్న గూగుల్ సంస్థ.. ఏరీకోరి సుందర్ పిచాయ్‌కు CEO పదవిని కట్టబెట్టింది. ముందుండి నడిపించే నాయకుడి పనితీరుపై అనుమానం వ్యక్తం చేస్తున్నారట గూగుల్ ఉద్యోగులు. ఇటీవల నిర్వహించిన ఉద్యోగుల సర్వేలో పిచాయ్‌కు వ్యతిరేకంగా భారీగా ఓట్లు నమోదైయ్యాయట.
గూగులీస్ట్ అని పిలిచే వార్షిక పోల్‌లో పలు అంశాలపై ఉద్యోగులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. పిచాయ్ కోణంలో పని చేస్తే సంస్థ మరింత ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు 78 శాతం మంది ఆమోదం తెలిపినా.. గతేడాది పోలిస్తే 10శాతం పాయింట్ల వరకూ తగ్గినట్లే.
మరో ప్రశ్నగా పిచాయ్ మేనేజ్‌మెంట్ ఇలానే కొనసాగితే భవిష్యత్‌లో గూగుల్ మరింత ఎఫెక్టివ్‌గా మారనుందా అని అడిగిన ప్రశ్నకు 74 శాతం మంది పాజిటివ్‌గా స్పందించారట. గతేడాదితో పోలిస్తే 18 పాయింట్ల వరకూ తగ్గిందట.
ఈ సర్వేలో 89శాతం మంది గూగుల్ ఉద్యోగులు పాల్గొన్నారు. సర్వే వివరాలను బట్టి ఇలా సుందర్ పిచాయ్ బలాలు ఈ విధంగా ఉన్నాయి.
- పిచాయ్ నిర్ణయాలు వ్యూహాలు సంస్థకు ఎంతవరకూ ఉపయోగపడుతున్నాయంటే… 75 శాతం మంది పాజిటివ్‌గా స్పందించగా గతేడాదితో పోలిస్తే 13 శాతం తగ్గింది.
- గూగుల్‌లో చేసిన మార్పులు చేర్పులు, ఇంతకాలం కనబరిచిన ప్రతిభ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే.. 79 శాతం మంది పాజిటివ్‌గా స్పందించగా గతేడాదితో పోలిస్తే 12 శాతం తగ్గింది.
- విలువలతో కూడిన ప్రాధాన్యత ఎలా పాటిస్తున్నారని అడిగిన ప్రశ్నకు 66 శాతం మంది పాజిటివ్‌గా స్పందించగా గతేడాదితో పోలిస్తే 13 శాతం తగ్గింది.