ప్రపంచ యుధ్ధం కన్నా కరోనా ప్రమాదకరమైనది

ప్రతి ఒక్కరూ ఇప్పడు కరోనాపై యుధ్ధం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రపంచ యుద్దం కంటే ప్రమాదకరంగా భావించి కరోనాపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 492 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని…ప్రజలంతా తప్పకుండా ప్రభుత్వం విధించిన నిబంధనలు పాటించాలని సూచించారు. ఇటలీని ఏలా పీడిస్తుందో గమనించాలని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ప్రభుత్వ ఆదేశాలను అక్కడి ప్రజలంతా తొలుత బేఖాతరు చేశారని, అందుకే ఆ పరిస్థితి తలెత్తిందని అన్నారు.
‘‘కొద్ది రోజుల క్రితం వరకు విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కరోనా సోకిందని…. దీని విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. నిర్లక్ష్యంగా ఉండొద్దని ఆయన కోరారు. ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు ఎమర్జెన్సీ ప్రకటిస్తారని.. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా దేశంలో ప్రతి వ్యక్తి యుద్ధం చేయాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. కరోనా ప్రపంచ యుద్ధం కన్నా తీవ్రమైందని ఆయన అభివర్ణించారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోజూ సమీక్ష జరుపుతున్నారని కిషన్ రెడ్డి చెప్పారు.
జనాభా ఎక్కువగా ఉన్న మన దేశంలో కరోనా వ్యాప్తి చెందకుండా అన్నిరకాల చర్యలు తీసుకొంటున్నట్టుగా మంత్రి తెలిపారు. లాక్ డౌన్ కు ప్రజలందరూ సహకరించాలని కిషన్ రెడ్డి కోరారు.చైనా మన దేశానికి సరిహద్దులో ఉన్నప్పటికీ మన దేశంలోకి ఆలస్యంగా కరోనా వైరస్ ప్రవేశించిందని ఆయన అభిప్రాయ పడ్డారు. ప్రతి వ్యక్తి స్వీయ నిర్భధం పాటించాల్సిన అవసంరం ఉందని కిషన్ రెడ్డి సూచించారు. విమానాశ్రయాల్లో 15.24 లక్షల మందికి స్క్రీనింగ్ చేసామని, కరోనా పాజిటివ్ వచ్చిన37 మందికి చికిత్స చేసి డిశ్చార్జ్ చేశామని ఆయన తెలిపారు.
విదేశాలనుంచి ఇండియా వచ్చి ఇళ్లలోనే ఉంటున్న వారిని ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నామని…మరో 436 మందిని ఇళ్లలోనే ఉంచి చికిత్స అందిస్తున్నామని ఆయన చెప్పారు. 5 లక్షల పీపీ కిట్లు, 10 లక్షల మాస్కులు సిధ్ధం చేసినట్ల కిషన్ రెడ్డి తెలిపారు. పీపీ కిట్లు, మాస్క్ లు విదేశాలకు ఎగుమతినినిషేధించామని…ఇప్పటికే అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేశామని…మంగళవారం అర్ధరాత్రి నుంచి దేశీయ సర్వీసులను కూడా నిలిపి వేస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. దేశంలోని 107 ఇమ్మిగ్రేషన్ సెంటర్లను మూసివేస్తున్నామని.. కరోనా వైరస్ కంట్రోల్ లోకి వచ్చేంతవరకు ప్రజలంతా జనతా కర్ఫ్యూ స్పూర్తితో ఉండాలని కిషన్ రెడ్డి కోరారు.
See Also | ఏపీలో కొత్త సెక్షన్: బయటకు వస్తే ఆరు నెలలు జైలుకే!