Himachal Pradesh: కందిరీగలు కుట్టి తల్లీకూతుళ్లు దుర్మరణం

: తల్లీకూతుళ్లు చీమలు కుట్టడంతో దుర్మరణం చెందిన ఘటన హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్పూర్ జిల్లాలో జరిగింది.

Himachal Pradesh: కందిరీగలు కుట్టి తల్లీకూతుళ్లు దుర్మరణం

Wasps Killed

Updated On : October 9, 2021 / 1:29 PM IST

Himachal Pradesh: తల్లీకూతుళ్లు కందిరీగలు కుట్టడంతో దుర్మరణం చెందిన ఘటన హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్పూర్ జిల్లాలో జరిగింది. ట్రీట్మెంట్ తీసుకుంటుండగా.. చండీఘడ్ లోని పీజీఐ హాస్పిటల్ లో కనుమూశారు. విద్యా దేవీ.. అంజన కుమారీ గడ్డి తీసుకొచ్చేందుకు పొలానికి వెళ్లారు.

గట్టి కోసుకుని తిరిగి వస్తుండగా కందిరీగల గుంపు వారిని దారుణంగా కుట్టాయి. అది విని పరిగెత్తుకుని వచ్చిన స్థానికులు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. తాండా మెడికల్ కాలేజీకి షిఫ్ట్ చేసినప్పటికీ చండీఘడ్ కు తరలించాలని చెప్పారు. ప్రైవేట్ కంపెనీలో సాధారణ జీతానికి పనిచేస్తున్న బాధితురాలి భర్త ట్రీట్మెంట్ కోసం డబ్బులు సమకూర్చలేకపోయాడు.

ఇద్దరు కొడుకుల తల్లి అయిన మహిళ చికిత్స తీసుకుంటూనే మృతి చెందింది. పంచాయతీ చీఫ్ లతా కుమారీ చాలా పేదరికానికి చెందిన యువతి అని చెబుతున్నారు.

………………………………………………….: ఏపీని విద్యుత్ కష్టాలు చుట్టుముట్టనున్నాయా?