Mulayam Singh Yadav Death: నేడు ప్రభుత్వ లాంఛనాలతో ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు.. పాల్గొననున్న కేసీఆర్, చంద్రబాబు

ములాయం సింగ్ యాదవ్ అంతక్రియలు మంగళవారం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3గంటలకు ములాయం స్వగ్రామం సైఫాయిలో అత్యక్రియలు జరగనున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

Mulayam Singh Yadav Death: నేడు ప్రభుత్వ లాంఛనాలతో ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు.. పాల్గొననున్న కేసీఆర్, చంద్రబాబు

Mulayam singh Yadav

Updated On : October 11, 2022 / 9:00 AM IST

Mulayam Singh Yadav Death: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మృతిచెందిన విషయం తెలిసిందే. అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 8.16గంటలకు తుదిశ్వాస విడిచారు. ములాయం సింగ్ మృతిపట్ల దేశవ్యాప్తంగా ప్రముఖులు సంతాపం తెలిపారు.

Mulayam Singh Yadav Death: ములాయం సింగ్ యాదవ్ మృతికి ప్రముఖుల సంతాపం.. ఎవరేమన్నారంటే..?

ములాయం సింగ్ యాదవ్ అంతక్రియలు మంగళవారం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3గంటలకు ములాయం స్వగ్రామం సైఫాయ్‌లో అత్యక్రియలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల నుండి ప్రజలు ఆయన స్వగ్రామానికి తరలిరావడంతో చివరి దర్శనార్ధం ములాయం భౌతికకాయాన్ని సోమవారం సాయంత్రమే సైఫాయ్‌ గ్రామంకు తరలించారు. ములాయం సింగ్ యాదవ్ కుమారుడు, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, మాజీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్, ఇతర కుటుంబ సభ్యులు సైఫాయ్ గ్రామంలో ఉన్నాయి.

Mulayam Singh Yadav Death: మూడు సార్లు ఉత్తర‌ప్రదేశ్ సీఎంగా పనిచేసిన ములాయం సింగ్ యాదవ్.. రాజకీయ ప్రస్థానం ఇలా..

ములాయం సింగ్ యాదవ్‌కు నివాళులు అర్పించేందుకు వీవీఐపీలతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు గ్రామానికి చేరుకోవడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సోమవారం రాత్రి 9:30 గంటల వరకు సుమారు పదివేల మంది వరకు నివాళులర్పించినట్లు సమాచారం. అయితే మంగళవారం సైఫాయ్ లో జరిగే ములాయం సింగ్ అంత్యక్రియలకు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు ప్రముఖులు ములాయం సింగ్ అత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించనున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.