10th విద్యార్ధినికి సహాయం చేసి.. పరీక్ష రాయించిన ట్రాఫిక్ పోలీస్

  • Published By: veegamteam ,Published On : March 5, 2020 / 08:32 AM IST
10th విద్యార్ధినికి సహాయం చేసి.. పరీక్ష రాయించిన ట్రాఫిక్ పోలీస్

Updated On : March 5, 2020 / 8:32 AM IST

ముంబైలో 10th పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షా కేంద్రానికి వెళ్లాలంటే ప్రతీరోజు ఒక యుద్ధమే. ముంబైలో ఉండే రద్దీ గురించి తెలియనిది కాదు. ఈ క్రమంలో ఓ విద్యార్ధిని 0th పరీక్ష రాయటానికి ఇంటి నుంచి బయలుదేరింది. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. రిక్షాలో వెళ్లాలని అనుకుంది. అలా ఖాట్ రిక్షా స్టాండ్ వద్దకు చేరుకుంది. కానీ ఖాట రిక్షా స్టాండ్ వద్ద ఎప్పుడూలాగానే పెద్ద క్యూ ఉంటుంది. దీంతో ఏం చేయాలో పాపం ఆ బాలికకు పాలుపోలేదు. ఓ పక్క పరీక్ష టైమ్ దగ్గరపడుతోంది. మరోపక్క వెళ్లలేని స్థితి. దీంతో పరీక్ష రాయలేకపోతానేమోననే భయంతో బాలిక వణికిపోతూ నిలబడింది. 

ఆమె పరిస్థితిని ఓ ట్రాఫిక్ పోలీస్ చూశాడు. చేతిలో పరీక్ష కోసం వెళ్లేందు హాల్ టిక్కెట్, ప్యాడ్..పెన్ వంటివి చూసి పరిస్థితి అర్థంచేసుకున్నాడు. వెంటనే ఓ రిక్షాను పిలిచాడు. పోలీస్ పిలిస్తే రాకుండా ఉంటాడా మరి. వెంటనే ఓ రిక్షా వాలా వచ్చాడు. వెంటనే ఆ విద్యార్ధినిని రిక్షా ఎక్కించి పరీక్ష కేంద్రానికి పంపించాడు ట్రాఫిక్ పోలీస్ రాహుల్ రౌత్.

బాలికను సకాలంలో పరీక్ష రాసేందుకు పంపించినందుకు చాలా ఆనందంగా ఉందని రాహల్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

దీనిపై నెటిజన్లు ట్రాఫిక్ పోలీస్ రాహుల్ రౌత్ ను ప్రశంసిస్తున్నారు. రాహుల్ చేసిన ఈ మంచిపనికి ముంబై పోలీస్ డిపార్ట్ మెంట్ కూడా ట్వీట్ చేసింది. ఓ విద్యార్ధికి తమ డిపార్ట్ మెంట్ వ్యక్తి సహాయం చేసినందుకు చాలా ఆనందంగా ఉందంటూ రాహుల్ ని అభినందించింది. ఈ సందర్భంగా 10th పరీక్షలు రాసే విద్యార్ధులందరికీ శుభాకాంక్షలు అంటూ తెలిపింది. 

See Also | డేంజరస్ ‘సాల్ట్ ఛాలెంజ్’.. టిక్‌టాక్‌లో ట్రెండింగ్