కేంద్రం 3వేలు పంపితే.. రాష్ట్ర ప్రభుత్వం 2లక్షల 27వేలు ఇచ్చింది

కేంద్రం 3వేలు పంపితే.. రాష్ట్ర ప్రభుత్వం 2లక్షల 27వేలు ఇచ్చింది

Updated On : April 6, 2020 / 12:26 PM IST

కరోనాపై పోరాడేందుకు ప్రభుత్వం అందించిన సహాయంపై బెంగాల్ సీఎం కామెంట్లు చేశారు. ఆదివారం (వ్యక్తిగత భద్రతా పరికరాలు) PPE 3వేలు పంపింది. బెంగాల్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు 2లక్షల 27వేల పరికరాలను సిద్ధం చేసిందని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. కాగా, ఈ రోజు(సోమవారం) మధ్యాహ్నానికి 61 కేసులు నమోదైనట్లు తెలిపారు. 

వాటిలో 7 కుటుంబాల నుంచి 55మంది ఉండగా, మిగిలిన వారు మాత్రమే వ్యక్తిగత పేషెంట్లు అని తెలిపారు. దేశ ప్రజలంతా దీపాలు పెట్టి ఐక్యతా భావాన్ని చాటాలని ప్రధాని ఇచ్చిన పిలుపుపైనా వ్యంగ్యంగానే సెటైర్ వేశారు. మీకు ఇష్టమైతే మీరు చెయ్యండి. నాకు చెయ్యాలనిపిస్తే నేను చేస్తానని తప్పించుకున్నారు.

మమతా చేసిన వ్యాఖ్యలన్నింటికీ రాష్ట్ర ప్రజలు సపోర్ట్ తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. తానొక్కరే సోషల్ డిస్టన్స్ కోసం సర్కిల్స్ చేస్తున్నారని.. పీపీఈలు ఏర్పాటు చేశారని పొగుడుతున్నారు.