Narcotics : బోర్డర్ లో రూ.25కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్
సరిహద్దుల గుండా భారత్ లోకి భారీగా డ్రగ్స్ సరఫరా చేసే ప్రయత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి.

Drugs
Narcotics సరిహద్దుల గుండా భారత్ లోకి భారీగా డ్రగ్స్ సరఫరా చేసే ప్రయత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. జమ్ముకశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలోని ఉరీ సెక్టార్‌లోని నియంత్రణ వెంబడి అనుమానిత కదలికలను గుర్తించిన సైనిక బలగాలను తనిఖీలు చేపట్టాయి. సైన్యం రాకతో మూడు డ్రగ్స్ నింపిన మూటలను సరిహద్దులో వదిలేసి పరాపోయారు దుండగులు.
పాకిస్తాన్ మార్కింగ్ ఉన్న ఈ సంచుల్లో సుమారు 25-30 కిలోల డ్రగ్స్(హెరాయిన్)ని స్వాధీనం చేసుకున్నట్లు ఆదివారం స్థానిక పోలీసులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ లో దీని విలువ రూ.25కోట్లు ఉంటుందని తెలిపారు. సంఘటనా స్థలంలో ఓ టోపీ, చిన్న బ్యాగులు, కొన్ని సంచులను స్వాధీనం చేసుకున్నట్లు బారముల్లా ఎస్ఎస్పీ రయీస్ మహమ్మద్ భట్ చెప్పారు. పోలీసులకు డ్రగ్స్‌ను అప్పగించిన తర్వాత విచారణ ప్రారంభమవుతుందని, సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేయనున్నట్లు చెప్పారు.
ALSO READ Drugs Into India : భారత్ లోకి నిషేధిత డ్రగ్స్ అసలు ఎలా వస్తున్నాయో తెలుసా
మరోవైపు,జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం అర్ధరాత్రి అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని పహాలెన్ మండలం సౌజన్ గ్రామం వద్ద పాక్ వైపు నుంచి వచ్చిన ఓ డ్రోన్ వస్తువులు జారవిడవడాన్ని గమనించిన స్థానికుడు పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గ్రామాన్ని అధీనంలో తీసుకుని సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఆయుధాలతో కూడిన ఓ పార్సిల్‌ను అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో పోలీసులు గుర్తించారు. ఇది పాకిస్తాన్ నుంచి అక్రమంగా డ్రోన్ ద్వారా జమ్ములోని వ్యక్తులకు చేరవేసే క్రమంలో జారిపడి ఉండవచ్చని పోలీసులు తెలిపారు.
SECURITY FORCES FOILED ATTEMPT OF SMUGGLING OF DRUGS FROM POK SIDE OF LOC IN URI SECTOR; NARCOTIC SUBSTANCES APPROX 20-30 KGS WORTH 20-25 CRORES (VALUE IN BLACK MARKET) RECOVERED & SEIZED BY BARAMULLA POLICE.@JmuKmrPolice@KashmirPolice pic.twitter.com/YLNKGQ1Cio
— Baramulla Police (بارہمولہ پولیس) (@BaramullaPolice) October 3, 2021