Sabyasachi : ఆ బ్రాండ్ చీరలకు నెటిజన్ల నుంచి ఝలక్.. అంత్యక్రియలకు హాజరవుతున్నారా? అంటూ మోడళ్లపై విమర్శలు
పండుగలు, వివాహాల సందర్భాల్లో డిజైనర్ బ్రాండ్లు తమ సరికొత్త డిజైన్లకు సంబంధించి ప్రకటనలు విడుదల చేస్తుంటాయి. తాజాగా ఓ ప్రముఖ బ్రాండ్ రిలీజ్ చేసిన యాడ్ విమర్శల పాలైంది.

Sabyasachi
Sabyasachi : ఓ యాడ్‌లో మోడళ్లంతా ఖరీదైన కొత్త చీరలు ధరించారు. అందరూ నడిచి వస్తుంటే చూసిన వారు మాత్రం షాకయ్యారు. ముఖంపై చిరునవ్వు లేకుండా విషాద వదనాలతో మోడళ్లపై చిత్రించిన యాడ్ విమర్శల పాలైంది.
పండుగలు, వివాహాల సీజన్‌కి ముందు డిజైనర్ బ్రాండ్ ‘సబ్యసాచి’ తన హెరిటేజ్ బ్రైడల్ చీరల కొత్త ప్రకటనను రిలీజ్ చేసింది. ఈ యాడ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ యాడ్‌లో మోడళ్లంతా కొత్త డిజైనర్ చీరలను ధరించారు. అయితే వారి ముఖంలో ఎటువంటి సంతోషం కనిపించలేదు. పైగా విషాదంగా, చికాకుగా ఉన్నట్లు కనిపించారు. పైగా ప్రకటనలో మోడల్స్ ముఖానికి బొట్టు ధరించకపోవడంపై విమర్శలు వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు.
Nalli Silks : మోడల్ బొట్టు పెట్టుకోకపోవడంతో వివాదాస్పదమైన యాడ్.. కంపెనీ ఏం చేసిందంటే?
కొంతమంది వినియోగదారులు బ్రాండ్‌ను అపహాస్యం చేసారు. కొందరు చీరల డిజైన్ల గురించి మాట్లాడుతూ అంత్యక్రియలకు కట్టుకునేలా ఉన్నాయని కామెంట్లు పెట్టారు. కొందరు జోకులు కూడా వేసారు. అసలు మోడళ్లు ఎందుకు విచారంగా ఉన్నారు? డిప్రెషన్‌లో ఉన్నారా? బొట్టు ఏమైంది? ఈ వేషధారణతో అంత్యక్రియలకు హాజరవుతున్నారా? నవ్వితే బాధగా ఉంటుందా? వరుసగా ఇలాంటి ప్రశ్నలు సంధించారు. దీనిపై ఆ బ్రాండ్ ఏం సమాధానం చెబుతుందో చూడాలి.
View this post on Instagram