Bengaluru : వాహనాల వెనుక వింత మెసేజ్‌లు.. ఓ ఆటో డ్రైవర్ మెసేజ్ చూసి షాకైన నెటిజన్లు
కారు, బైక్, లారీల వెనకాల వింత వింత మెసేజ్‌లు చూస్తుంటాం. కొన్ని విపరీతంగా నవ్వు పుట్టిస్తాయి. బెంగళూరులో ఓ ఆటో వెనుక రాసిన అక్షరాలు చూసి జనం ఆశ్చర్యపోయారు.

Bengaluru
Bengaluru : రోడ్డు మీద అనేక వాహనాలను చూస్తుంటాం. ముఖ్యంగా లారీలు, ఆటోలు, బైక్‌ల వెనుక వాటి ఓనర్లు వింత వింత కొటేషన్లు పెడుతుంటారు. బెంగళూరులో ఓ ఆటో డ్రైవర్ తన ఆటో వెనుక రాసిన అక్షరాలు చూసి జనం ఆశ్చర్యపోయారు. అతని ఆటో వెనుక ఏం మెసేజ్ ఉందంటే?
లారీ, బైక్, ఆటోల వెనకాల రకరకాల మెసేజ్‌లు చూస్తుంటాం. కొందరు దేవుడి మీద భక్తితో వారు పూజించే దేవుడి పేర్లు రాసుకుంటారు. కొందరు తమకు ఇష్టమైన వారి మీద ప్రేమను పంచుకుంటూ మెసేజ్‌లు పెడతారు. ఇంక కొందరు తమ వాహనం అందరినీ ఆకట్టుకునేలా మెసేజ్‌లు పెడతారు. కొందరు తమ వాహనానికి దిష్టి తగలకుండా కూడా మెజేస్‌లు పెడతారు. అందులో కొన్ని ..
నన్ను చూసి ఏడవకురా
అప్పు చేసి కొన్నా
నరదిష్టికి నమస్కారం
హాయ్ అని ఆశ పెట్టకు.. బాయ్ అని బాధ పెట్టకు
నో కాలేజ్ బట్ ఫుల్లీ నాలెడ్జ్
ఏంటి బంటీ, నీ బండి స్లోనా ఏంటి?
అందమైన అమ్మాయికి ఆటో ఫ్రీ
వీటిని చూస్తుంటే నవ్వొస్తుంది. అంతేకాదు జనం ఇలాంటి వాటిని ఆసక్తిగా చూస్తుంటారు.
Sourav Ganguly : పశ్చిమబెంగాల్ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా సౌరవ్ గంగూలీ…మమతా బెనర్జీ ప్రకటన
బెంగళూరులో ఓ ఆటో వెనుక ‘చెత్త వాహనం కొనొద్దు’ అని రాసి ఉండటం నెటిజన్లను ఆకట్టుకుంది. బెంగళూరుకు చెందిన న్యాయవాది ఆశిష్ కృపాకర్ (@followdcounsel) ఈ ఫోటోను గతంలో ట్విటర్‌లో ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆటోరిక్షా డ్రైవర్ వాహనం వెనుక “చెత్త వాహనం కొనవద్దు” అని రాసి ఉంది. “చెడు ఉత్పత్తిని కొనుగోలు చేయవద్దని ఇతరులకు చెప్పడం ఎంత వినూత్నమైన మార్గం! కేవలం బెంగళూరులో ఇలాంటివి సాధ్యం” అని కృపాకర్ రాశారు. ఆటోపై తమిళం, కన్నడ భాషల్లో రాసి ఉండటం కనిపిస్తుంది. కన్నడలో అయితే ‘ఇది చెత్త వాహనం .. కొనవద్దు’ అని స్పష్టంగా రాశాడు. ఈ పోస్టు చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు. అతని నిజాయితీని మెచ్చుకున్నారు.
What an innovative way to tell others not to buy a bad product! Just #NammaBengaluru things. pic.twitter.com/JaIVYIwEnb
— Ashish Krupakar (@followdcounsel) October 27, 2023