Modi New Cabinet : కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు.. ఎవరెవరికి ఏ శాఖ అంటే?
ప్రధాని నరేంద్ర మోదీ కొత్త కేబినెట్ కొలువుదీరింది. ప్రమాణస్వీకారం చేసిన కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. కిషన్ రెడ్డికి మూడు శాఖలను కేటాయించారు. అమిత్ షాకు హోంశాఖతో పాటు అదనంగా సహకార శాఖను కేటాయించారు.

New Portfolios Assigned Amit Shah To Head Ministry Of Cooperation
Cabinet Reshuffle : ప్రధాని నరేంద్ర మోదీ కొత్త కేబినెట్ కొలువుదీరింది. కేంద్ర కేబినెట్ లో భారీ మార్పులు జరిగాయి. మోదీ కేబినెట్ లో కొత్తగా 43 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. 15 మంది కేబినెట్ మంత్రులుగా, 28 మంది సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మోదీ కేబినెట్ లో మంత్రుల శాఖల్లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రమాణస్వీకారం చేసిన కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. అమిత్ షాకు సహకార శాఖ కేటాయించారు. అమిత్ షాకు హోంశాఖతో పాటు అదనంగా సహకార శాఖను కేటాయించారు.
కిషన్ రెడ్డికి మూడు శాఖలు :
కిషన్ రెడ్డికి మూడు శాఖలను కేటాయించగా.. అందులో పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖలను కేటాయించారు. ఇక రక్షణ శాఖ మంత్రిగా రాజ్ నాథ్ సింగ్, రోడ్డు, రవాణా శాఖ మంత్రిగా నితిన్ గడ్కరీ, ఉక్కు శాఖ మంత్రిగా రామచంద్రప్రసాద్ సింగ్ శాఖను కేటాయించారు.మన్సుఖ్ మాండవియకు ఆరోగ్య శాఖ, కెమికల్ ఫెర్టిలైజర్స్ శాఖ, పీయూష్ గోయెల్‌కు వాణిజ్య, టెక్స్ టైల్స్ శాఖ, ఆహార, ప్రజా పంపిణీ శాఖలను కేటాయించారు.
స్మృతి ఇరానీకి మహిళ, శిశుసంక్షేమ శాఖ, ధర్మేంద్ర ప్రధాన్‌కు విద్యాశాఖ, స్కిల్ డెవలప్ మెంట్ శాఖ, అశ్వనీ వైష్ణవ్ కు రైల్వే శాఖ, ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ కేటాయించగా.. హార్దీప్ సింగ్ పూరికి పట్ణణాభివృద్ధి, గృహనిర్మాణ, పెట్రోలియం శాఖలు, జ్యోతిరాదిత్య సింథియాకు పౌర విమానయాన శాఖ, అనురాగ్ ఠాకూర్ కు క్రీడాశాఖ, సమాచార శాఖలను కేటాయించగా, మీనాక్షి లేఖికి విదేశాంగ, సాంస్కృతిక శాఖ కేటాయించారు.
గిరిరాజ్ సింగ్ కి గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖను కేటాయించగా.. పశుపతి పరాస్ కి ఫుడ్ ప్రాసెసింగ్ శాఖను కేటాయించారు. భూపేంద్ర యాదవ్ కు కార్మిక శాఖ కేటాయించారు. కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఆర్కే సింగ్ కు కేటాయించారు. నరేంద్ర సింగ్ తోమర్ కు వ్యవసాయ శాఖను కేటాయించారు. పురుషోత్తం రూపాలకు మత్స్య, పశుసంవర్దక, డెయిరీ శాఖ, సోనోవాల్ కు నౌకయాన శాఖ కేటాయించారు.
– డాక్టర్ జైశంకర్ -విదేశీ వ్యవహారాలు
– అర్జున్ ముండా – గిరిజన సంక్షేమం
– ప్రహ్లాద్ జోషీ – పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనుల శాఖ
– నారాయణ్ రాణే – చిన్న, మధ్యతరహా పరిశ్రమలు
– సర్వానంద్ సోనోవాల్ – ఓడరేవులు, జలరవాణా, ఆయుష్ శాఖ
– ముక్తార్ అబ్బాస్ నఖ్వీ – మైనార్టీ వ్యవహారాల శాఖ
– డాక్టర్ వీరేంద్ర కుమార్ – సామాజిక న్యాయం, సాధికారత
– గజేంద్రసింగ్ షెకావత్ – జల శక్తి
– రాజ్కుమార్ సింగ్ – విద్యుత్, పునరుత్పాదక ఇంధన శాఖ
– మహేంద్రనాథ్ పాండే – భారీ పరిశ్రమల శాఖ
రాష్ట్రపతి భవన్‌లో బుధవారం (జూలై 7) సాయంత్రం జరిగిన కార్యక్రమంలో 43మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. 15 మంది కేబినెట్ మంత్రులు, 28 మంది సహాయ మంత్రులతో రాష్ట్రపతి ప్రమాణం చేయించారు. మొత్తం 43 మందిలో 36 మంది కొత్తవారు కాగా, ఏడుగురు పదోన్నతి పొందినవారు ఉన్నారు. సహాయ మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్, పురుషోత్తం రూపాలా, కిరణ్ రిజిజు, మన్‌సుఖ్ మాండవియా, హరిదీప్‌సింగ్ పురీ, రామచంద్ర ప్రసాద్ సింగ్.. కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. మొత్తంగా 16 రాష్ట్రాల నుంచి 36 మందికి కేబినెట్‌లో స్థానం దక్కింది.