Nikki CCTV footage: ప్రియురాలిని హతమార్చి ఫ్రీజర్ లో పెట్టిన ఘటన.. సీసీటీవీలో యువతి దృశ్యాలు

నైరుతి ఢిల్లీ నజాఫ్‌గఢ్‌లో ఓ ధాబాలోని ఫ్రీజర్ లో ఓ యువతి మృతదేహం కనపడిన ఘటనపై పోలీసుల విచారణలో కీలక విషయాలు తెలిశాయి. నిందితుడు సాహిల్ గెహ్లాట్ (25) వద్దకు బాధితురాలు నిక్కీ యాదవ్ (23) వెళ్తున్న సమయంలో ఆమె దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. సాహిల్ వద్దకు వెళ్లేందుకు మెట్లు ఎక్కుతుండగా నిక్కీ యాదవ్ ముఖం కూడా ఇందులో స్పష్టంగా కనపడుతోంది.

Nikki CCTV footage: ప్రియురాలిని హతమార్చి ఫ్రీజర్ లో పెట్టిన ఘటన.. సీసీటీవీలో యువతి దృశ్యాలు

Nikki CCTV footage

Updated On : February 15, 2023 / 5:41 PM IST

Nikki CCTV footage: నైరుతి ఢిల్లీ నజాఫ్‌గఢ్‌లో ఓ ధాబాలోని ఫ్రీజర్ లో ఓ యువతి మృతదేహం కనపడిన ఘటనపై పోలీసుల విచారణలో కీలక విషయాలు తెలిశాయి. నిందితుడు సాహిల్ గెహ్లాట్ (25) వద్దకు బాధితురాలు నిక్కీ యాదవ్ (23) వెళ్తున్న సమయంలో ఆమె దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. సాహిల్ వద్దకు వెళ్లేందుకు మెట్లు ఎక్కుతుండగా నిక్కీ యాదవ్ ముఖం కూడా ఇందులో స్పష్టంగా కనపడుతోంది.

నిక్కీ యాదవ్ ను సాహిల్ గొంతునులిమి చంపేసి, మృతదేహాన్ని ఫ్రీజర్ లో పెట్టినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నిక్కీని రెండు-మూడు రోజుల ముందు హత్య చేశాడని పోలీసులు గుర్తించారు. ధాబా యజమాని, నిక్కీ ప్రియుడు సాహిల్ గహ్లోత్ ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. నిక్కీ యాదవ్ ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లో నివసించేది.

నిక్కీ, సాహిల్ కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఆమెతో సంబంధాన్ని కొనసాగిస్తూనే మరో అమ్మాయితో సాహిల్ పెళ్లి కుదిరింది. దీంతో అతడితో నిక్కీ గొడవ పెట్టుకుంది. ఆమెను సాహిల్ హత్య చేసి, తన ధాబాలోని ఫ్రీజర్ లో మృతదేహాన్ని ఉంచాడు. నిక్కీ కనపడకపోవడంతో విచారణ జరిపిన పోలీసులకు అసలు విషయం తెలిసింది.

ఇప్పటికే నిక్కీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కొన్ని వారాల క్రితం ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరవకముందే మళ్లీ నిక్కీ కూడా అదే రీతిలో మృతి చెందడం గమనార్హం.

Valentine’s Day: వాలెంటైన్స్ డే జరుపుకొనేందుకు గోవా వెళ్లిన జంట.. నీళ్లలో మునిగి ప్రేమికులు మృతి