గాలి పీల్చుకోలేకపోతున్నాం సార్ : రాష్ట్రపతి భవన్ ముందు రాత్రంతా బాలిక దీక్ష

Delhi : అర్ధరాత్రి 9 ఏళ్ల బాలిక రాష్ట్రపతి భవన్ ముందు ప్లకార్డు పట్టుకొని దీక్ష చేసింది. ఢిల్లీలో గాలి పీల్చుకోలేకపోతున్నాం..మమ్మల్ని బతకనివ్వండీ..ఈ కాలుష్య సమస్యకు పరిష్కారం చూపండీ సార్..అంటూ రాష్ట్రపతి భవన్ ఎదుట 9ఏళ్ల ఢిల్లీలో అర్ధరాత్రి లిసిప్రియా కంగుజమ్ అనే 9 ఏళ్ల బాలిక ఆవేదన వ్యక్తంచేస్తు ప్రశ్నించింది.
పర్యావరణ కాలుష్యాన్ని వ్యతిరేకిస్తూ లిసిప్రియా కంగుజమ్ ఆందోళన చేపట్టింది. తమకు తాత్కాలిక పరిష్కారం కాదని శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేసింది. ఆ బాలికతో పాటు మరికొందరు పర్యావరణ పరిరక్షణ కార్యకర్తలు కూడా జత చేరి తమ మద్దతుతెలిపారు.
రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడమే పనిగా పెట్టుకున్నారు తప్ప పరిష్కారం చూపడం లేదని ఆరోపిస్తు విమర్శించింది. పర్యావరణ కాలుష్యం వల్ల ప్రపంచ వ్యాప్తంగా 60 లక్షల మంది చిన్నారులు చనిపోతున్నారని..ఇలా కాలుష్యం కాటుకు చిన్నారులు బలికావాల్సిందేనా.. అంటూ ఆవేదనగా ప్రశ్నించింది.
నిరసన తర్వాత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కలిసి తమ డిమాండ్‌లు వినిపించారు. ఢిల్లీ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రమాదకరమైన ఫ్యాక్టరీలను మూసివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఆ చిన్నారి మెరుపు దీక్ష ఇప్పుడు యావత్ దేశాన్ని ఆలోచనలో పడేసింది.