నిత్యానంద వేషాలు.. బంగారంతో మెరిసిపోతున్న స్వామి
స్వామి నిత్యానంద.. ఈయనో అవతార పురుషుడు.. స్వామి వేషాలు.. లీలల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆధ్యాత్మికత కంటే వివాదాలు, ఆరోపణలకు ఈయన కేరాఫ్ అడ్రస్. వివాదాస్పద స్వామీజీగా సొం

స్వామి నిత్యానంద.. ఈయనో అవతార పురుషుడు.. స్వామి వేషాలు.. లీలల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆధ్యాత్మికత కంటే వివాదాలు, ఆరోపణలకు ఈయన కేరాఫ్ అడ్రస్. వివాదాస్పద స్వామీజీగా సొంత దేశాన్ని సృష్టించాడు. దానికి కైలసం అని పేరు కూడా పెట్టాడు.
అత్యాచార ఆరోపణలతో దేశం నుంచి పారిపోయిన నిత్యానంద దక్షిణ అమెరికా తీరంలోని కంట్రీ ఈక్వెడార్ లో దీవిని కైలసంగా మార్చేశారు. ఇప్పుడు నిత్యానంద వేషాలు.. లీలలకు సంబంధించి కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తనకు తానే ఈశ్వరుడిగా ప్రకటించుకున్న నిత్యానంద.. రోజుకో అవతారం దాలుస్తూ తానే అవతార పురుషుడిగా చెప్పుకుంటున్నాడు.(ఆ బాబు పేరు లాక్ డౌన్.. కారణం చెప్పిన తల్లిదండ్రులు)
కొన్నాళ్ల క్రితం ఈశ్వరుడిలా అవతారం దాల్చి.. తానే పరమశివమని కటింగ్ ఇచ్చిన నిత్యానంద.. ఇప్పుడు మరో వేషధారణలో అందరిని అలరిస్తున్నాడు. తనను నమ్మిన భక్తులను, శిష్యులను విష్ణుమూర్తిలా కటాక్షిస్తున్నాడు. నిత్యానంద దేవుడి వేషధారణలో ఒళ్లంతా బంగారం ధరించి తానే భగవత్ స్వరూపుడిగా ప్రకటించుకున్నాడు.
తలపై కిరీటం ధరించి.. నుదిటిన నామాలు ధరించి.. ధ్యాన ముద్రలో ఉన్నట్టు నిత్యానంద ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి నిత్యానంద అసలు పేరు.. రాజశేఖరన్. ఆయన స్వస్థలం తమిళనాడు. 2000లో బెంగళూరు శివార్లలో ఆశ్రమాన్ని స్థాపించారు. 2010లో ఓ నటితో నిత్యానంద సన్నిహితంగా ఉన్న వీడియోలో ఆయన రాసలీలలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.