Nithyananda: ఇండియాకు నేనొస్తే కరోనా ఖతం అంతే..
ఇండియా కరోనా సెకండ్ వేవ్ తో సతమతమవుతూ.. వ్యాక్సినేషన్ ప్రక్రియతో గట్టెక్కాలని ప్రయత్నిస్తుంది. ఇదిలా ఉంటే తనను తాను దేవుడిగా ప్రకటించుకున్న నిత్యానందకు సంబంధించిన వీడియో హల్‌చల్ చేస్తుంది.

Nithyananda Says His Arrival Will End Covid In India
Nithyananda: ఇండియా కరోనా సెకండ్ వేవ్ తో సతమతమవుతూ.. వ్యాక్సినేషన్ ప్రక్రియతో గట్టెక్కాలని ప్రయత్నిస్తుంది. ఇదిలా ఉంటే తనను తాను దేవుడిగా ప్రకటించుకున్న నిత్యానందకు సంబంధించిన వీడియో హల్‌చల్ చేస్తుంది. రెండ్రోజుల ముందు విడుదలైన వీడియోలో ఇండియాకు కొవిడ్ బాధ ఎప్పుడు తప్పుతుందని ప్రశ్నించారు.
దానికి సమాధానమిచ్చిన నిత్యానంద.. అమ్మ ఆధ్మాత్మిక శరీరంలోకి ప్రవేశించింది. తాను ఒక్కసారి ఇండియా నేలపై అడుగుపెడితేనే పరిస్థితులు చక్కబడతాయి. నిత్యానంద ప్రస్తుతం హైపోథెటికల్ ల్యాండ్ కైలాశలో ఉండి ఆపరేట్ చేస్తున్నారు.
అతనిపై 2019లో లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం అతనొక ఐలాండ్ లో ఉంటూ దానికి కైలాసం అనే పేరు పెట్టుకున్నారు. ఇంకా ఆ ప్రదేశానికి ఇండియన్లు ఎవరూ రాకూడదంటూ చెప్పిన నిత్యానంద.. బ్రెజిల్, యూరోపియన్ యూనియన్, మలేసియాల నుంచి కూడా రావొద్దంటూ ఆంక్షలు విధించారు.
స్థానిక చట్టాల ప్రకారం.. కైలాసవాసులు, ఏకైలాసియన్లు, వాలంటీర్లు అంతా క్వారంటైన్ లో ఉంటూ.. ముందస్తు జాగ్రత్త చర్యలు పాటిస్తూ క్వారంటైన్ లో ఉంటున్నారని అధికార ప్రతినిధి చెబుతున్నారు.