NRC అమలుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు : కేంద్రం

  • Published By: sreehari ,Published On : February 4, 2020 / 09:41 AM IST
NRC అమలుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు : కేంద్రం

Updated On : February 4, 2020 / 9:41 AM IST

దేశవ్యాప్తంగా జాతీయ పౌరుల పట్టిక (NRC) ఇంకా అమలు చేయలేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. లోక్ సభలో ఎన్ఆర్‌సీ అమలుపై లేవనెత్తిన ప్రశ్నకు బదులుగా మంత్రిత్వ శాఖ రాతపూర్వకంగా సమాధానమిచ్చింది. దేశంలోని ప్రతి రాష్ట్రంలో NRC ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారని కేంద్రంపై సభలో ప్రశ్నల వర్షం కురిసింది. దీనికి రాతపూర్వకంగా లోక్ సభలో కేంద్ర హోం వ్యవహారాల శాఖ మంత్రి నిత్యానంద్ సమాధానమిచ్చారు.

పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఎన్ఆర్ సీని అమలు చేసేందుకు ఎలాంటి కార్యాచరణకు నిర్ణయం తీసుకోలేదన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై పార్లమెంటులో సోమవారం చర్చ జరిగింది. ఈ క్రమంలో లోక్ సభ, రాజ్యసభలోని విపక్ష పార్టీల సభ్యులందరూ బడ్జెట్ పై చర్చించాలని పట్టుబట్టారు. ఈ చర్చలో ఎక్కువగా పౌరసత్వ సవరణ చట్టం (CAA), NRC, నేషనల్ పాపిలేషన్ రిజిస్టర్ (NPR)లపై ప్రధానంగా చర్చించాల్సిందిగా డిమాండ్ చేశాయి.

రాజ్యసభలోని ప్రధాన విపక్ష పార్టీ నేత గులామ్ నబీ అజాద్ మాట్లాడుతూ.. దాదాపు అన్ని విపక్ష పార్టీల్లో DMK, CPI, CPI(M), NCP, RJD, TMC, SP, BSP పార్టీలన్నీ రూల్ 267 కింద నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు. మిగతా విషయాలన్నింటిని వాయిదా వేసి ప్రత్యేకించి ఈ మూడు అంశాలపై చర్చించాలన్నారు. ‘గత రెండు నెలలుగా సీఏఏ బిల్లు చట్టంగా మారినప్పటినుంచి దేశమంతా రోడ్డుపైకి వచ్చింది. ఎన్ పీఆర్ కూడా ఇంతముందే జరిగింది. 

కానీ, ఇక్కడ ప్రశ్నలు చాలా సరళమైనవిగా భావించాలి. ఈ ప్రభుత్వం కిందే ఎన్ పీఆర్ ఉంటే… ఇతర వివరాల్లో తండ్రి పుట్టిన తేదీని అడుగుతున్నారు. ఈ ప్రభుత్వం కింద ఈ ఎన్‌పిఆర్‌లో ఇతర వివరాలు తండ్రి పుట్టిన తేదీని అడిగారు’ అని ఆయన అన్నారు. దేశంలో హిందు ముస్లిం సమస్య ఉందని ప్రభుత్వ చెబుతోంది. కానీ, తామంతా దేశంలో ఎలాంటి హిందు ముస్లిం సమస్యలే లేవని భావిస్తున్నామని అజాద్ తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైనందునే కావాలనే ప్రజల దృష్టిని పక్కదారి పట్టించిందుకే కేంద్రం ఇలా చేస్తుందని విమర్శించారు.