రిజర్వేషన్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదు : సుప్రీం

రిజర్వేషన్ కల్పన అన్నది ప్రాధమిక హక్కేమీ కాదు. నియామకాలు, పదోన్నతుల్లో మనహాయింపులు ఇవ్వాలా? వద్దా? అన్నది ప్రభుత్వ నిర్ణయమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
ప్రభుత్వ పదవుల నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్ ప్రభుత్వానికి తప్పనిసరేమీకాదు. కొన్ని జాబ్స్, పోస్టుల్లో ఎస్‌సీ, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాలని ఆయా రాష్ట్రాలను కోర్టులు ఆదేశించలేవని సుప్రీం కోర్టు తన తీర్పులో వెల్లడించింది. ఏ ఒక్కరికీ వ్యక్తిగతంగా రిజర్వేషన్ కోరడం ప్రాధమిక హక్కు కాదని తేల్చేసింది. ఎవరికి మినహాయింపులు ఇవ్వాలో ప్రభుత్వ నిర్ణయమని సుప్రీం క్లారిటీ ఇచ్చింది.
“రిజర్వేషన్స్ ను కల్పించాల్సిన బాధ్యతేమీ రాష్ట్రప్రభుత్వాల మీద లేదు. పదోన్నతుల్లో మినహాయింపులు కోరడం ఏ ఒక్కరికీ ప్రాధమిక హక్కు కాబోదు. రిజర్వేషన్లు ఇవ్వమని ఏ రాష్ట్రప్రభుత్వానికి ఏ కోర్టు ఆదేశించలేదు” అని ఫిబ్రవరి7న ఇచ్చిన తీర్పులో జస్టిస్ ఎల్. నాగేశ్వరావు, హేమంత్ గుప్తా పేర్కొన్నారు.
ఎస్‌సీ, ఎస్టీలకు ఎలాంటి రిజర్వేషన్ లేకుండా అన్ని ప్రభుత్వ ఉద్యోగాల నియమాకాలు చేపట్టాలన్న 2012 నాటి ఉత్తరాఖండ్ ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేసిన హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు పక్కనపెట్టింది. ఎవరికి రిజర్వేషన్లు ఇవ్వాలో తేల్చుకొనే హక్కు రాష్ట్రాలను ఉందని స్పష్టం చేసింది.