CJI : పార్లమెంట్ పనితీరుపై ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు
పార్లమెంటు పనితీరుపై భారత ప్రధాన న్యాయమూర్తి( CJI) ఎన్వీ రమణ పదునైన పదజాలంతో విమర్శలు గుప్పించారు. చట్టాల రూపకల్పన సమయంలో పార్లమెంట్ లో వాటిపై విసృత స

Cji (1)
CJI పార్లమెంటు పనితీరుపై భారత ప్రధాన న్యాయమూర్తి( CJI) ఎన్వీ రమణ పదునైన పదజాలంతో విమర్శలు గుప్పించారు. చట్టాల రూపకల్పన సమయంలో పార్లమెంట్ లో వాటిపై విసృత స్థాయి చర్చలు జరగకపోవడం పల్ల ఎన్వీ రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం ఢిల్లీలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎన్వీ రమణ..పార్లమెంట్ పనితీరుపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ప్రస్తుతం పార్లమెంట్ ఉభయసభల్లో చర్చలు దురదృష్టకరమని ఎన్వీ రమణ అన్నారు. పార్లమెంటులో చట్టాలు చేసే సమయంలో సరైన చర్చ జరుగుతున్నట్టు కనిపించడం లేదని… అర్థవంతమైన చర్చ జరగని కారణంగా ఆ చట్టం చేయడం వెనుక ఉద్దేశం ఏంటో అర్థం కాని పరిస్థితి నెలకొందని.. ఫలితంగా అనేక వివాదాలు తలెత్తి ప్రభుత్వానికి, ప్రజలకు అసౌకర్యంగా మారుతుందని ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. కొన్ని చట్టాలను కోర్టులు సైతం అర్థం చేసుకోలేకపోతున్నాయని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా పార్లమెంట లో పారిశ్రామిక వివాదాల చట్టంపై జరిగిన చర్చను సీజేఐ ప్రస్తావించారు. తమిళనాడుకి చెందిన సీపీఎం నేత రామ్మూర్తి ఆ చట్టం విసృతంగా చర్చించారని..దాని వల్ల కలిగే పరిణామాలు..కార్మికులపై దాని ప్రభావాన్ని చక్కగా వివరించారన్నారు. అలాగే ఇతర చట్టాలను పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన సందర్భంలో పూర్తిస్థాయిలో చర్చలు జరిగేవన్నారు. దీనివల్ల ఆయా చట్టాల లక్ష్యం,ఎవరిని ఉద్దేశించి వాటిని తయారు చేశారో సృష్టంగా తెలిసేదన్నారు. తద్వారా వాటిని విశ్లేషించాల్సి వచ్చినప్పుడు కోర్టులకు పని సులవయ్యేదన్నారు. కానీ ప్రస్తుతం పార్లమెంట్ చర్చల విషయంలో చాలా విచారకరమైన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. చట్టసభల్లో మేధావులు, న్యాయవాదులు లేకపోతే ఇలానే జరుగుతుందన్నారు.
చట్టసభల పనితీరులో వచ్చిన మార్పులను ప్రస్తావిస్తూ… సామాజిక, ప్రజా జీవితంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు సీజేఐ. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో చట్టసభ్యులుగా ఉన్నవారిలో న్యాయవాదులు ఎక్కువగా ఉండేవారని ఎన్వీ రమణ గుర్తు చేశారు. అప్పట్లో వారంతా ప్రతి అంశంపైనా విస్తృతంగా, నిర్మాణాత్మకంగా చర్చించి, చట్టాలు చేసేవారని చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో పథకాల్ని సమీక్షించుకోవల్సిన సమయం ఆసన్నమైందన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్రమంటే చిన్న సమయం కాదన్నారు.
READ Ruckus in Parliament : భారత చట్టసభల్లోనే కాదు.. ఆ దేశ పార్లమెంట్లలోనూ ఇదే రచ్చ!
READ Parliament Insulted : పార్లమెంట్ ని అవమానించారు..విపక్షాలపై మోదీ ఫైర్