ప్రయాణికులకు గుడ్ న్యూస్ : వెయ్యి రైల్వే స్టేషన్లలో ఫ్రీ Wi-Fi
భారత రైల్వే ప్రయాణికులకు శుభవార్త. రైల్వే స్టేషన్లు వై-ఫై జోన్లగా మారిపోయాయి. ఇక నుంచి రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు ఉచితంగా వై-ఫై సర్వీసు ఎంజాయ్ చేయవచ్చు.

భారత రైల్వే ప్రయాణికులకు శుభవార్త. రైల్వే స్టేషన్లు వై-ఫై జోన్లగా మారిపోయాయి. ఇక నుంచి రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు ఉచితంగా వై-ఫై సర్వీసు ఎంజాయ్ చేయవచ్చు.
భారత రైల్వే ప్రయాణికులకు శుభవార్త. రైల్వే స్టేషన్లు వై-ఫై జోన్లగా మారిపోయాయి. ఇక నుంచి రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు ఉచితంగా వై-ఫై సర్వీసు ఎంజాయ్ చేయవచ్చు. రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రైల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (మిని రత్నా CPSU) దేశవ్యాప్తంగా వెయ్యి స్టేషన్లలో ఫ్రీ వై-ఫై జోన్లను ఏర్పాటు ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసింది. రెండు సంవత్సరాల మూడు నెలల్లో రైల్ వైర్ వై-ఫై ప్రాజెక్టును పూర్తి చేసి దాదాపు వెయ్యి రైల్వే స్టేషన్లను వై-ఫై జోన్లుగా మార్చేశారు. ఇప్పటివరకూ రైల్ టెల్ 1000 స్టేషన్లలో వై-ఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు ఓ నివేదిక వెల్లడించింది.
Read Also : భ్రష్టు పట్టిస్తోంది : ఏంటీ ‘Bigo Live’.. మాయలో కుర్రోళ్లు
వై-ఫై సర్వీసు.. ఈ స్టేషన్ నుంచే ఫస్ట్ :
జనవరి 2016లో ముంబై సెంట్రల్ స్టేషన్ నుంచి రైల్ టెల్ వై-ఫై సర్వీసు ప్రాజెక్టును ప్రారంభించింది. వై-ఫై సర్వీసు సౌకర్యం అందుబాటులోకి వచ్చిన 1000 రైల్వే స్టేషన్ గా ముంబైలోని సెంట్రల్ రైల్వే రే రోడ్ స్టేషన్ రికార్డు ఎక్కింది. భవిష్యత్తులో మరెన్నీ స్టేషన్లలో వైఫై నెట్ వర్క్ ను విస్తరించే దిశగా రైల్వే శాఖ అడుగులు వేస్తోంది. ఇటీవల రైల్ టెల్.. టాటా ట్రస్ట్ లో వైఫై సర్వీసును అందించగా.. మిగిలిన 4791 బి, సీ, డీ, ఈ కేటగిరీ స్టేషన్లలో కూడా దేశవ్యాప్తంగా వైఫై సర్వీసును అందుబాటులోకి తేనుంది. ఈ ఏడాది ఆఖరులోగా ఈ తరహా స్టేషన్లలో ఫ్రీ హైస్పీడ్ రైల్ వైర్ వై-ఫై నెట్ వర్క్ ను ఏర్పాటు చేయనుంది.
Read Also : అకౌంట్ unlock కోసం వాట్సాప్ లో కొత్త ఫీచర్
అన్ని రైల్వే స్టేషన్లలో (సర్వీసు నిలిచిపోయిన స్టేషన్లు మినహా) ఉచితంగా వేగవంతమైన రైల్ వైర్ వై-ఫై సర్వీసు ప్రయాణికులు వినియోగించుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్లలో కూడా వై-ఫై సర్వీసులను అందుబాటులోకి రానుంది. తద్వారా డిజిటల్ పరంగా హబ్ గా తీర్చిదిద్దాలని రైల్వే శాఖ యోచిస్తోంది. రైల్ వైర్ అనే రిటైల్ బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్ నుంచి రైల్వే ప్రయాణికులకు స్టేషన్లలో ఉచితంగా వై-ఫై నెట్ వర్క్ ను అందించనున్నారు. ప్రయాణికుల చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. KYC ఆధారంగా ఉచితంగా వైఫై సర్వీసును సులభంగా యాక్సస్ చేసుకోవచ్చు.
కోటికి పైగా యూజర్లు.. TB డేటా :
రైల్ టెల్.. హైస్పీడ్ వై-ఫై సౌకర్యాన్ని 414A, A1, C కేటగిరీ రైల్వే స్టేషన్లలో అందించింది. టెక్నాలజీ పార్టనర్ గూగుల్, రేడియా యాక్సస్ ఆధారంగా రైల్ టెల్ ఈ వై-ఫై సదుపాయాన్ని ఆయా స్టేషన్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అన్ని రైల్వే స్టేషన్లలో డిజిటల్ వైఫై సర్వీసులను అందించడమే లక్ష్యంగా రైల్ టెల్ ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం వై-ఫై సదుపాయం ఉన్న రైల్వే స్టేషన్లలో ఫిబ్రవరి 2019 నెలలో మొత్తం 1,15,77,141 మంది యూనిక్ యూజర్లు ఉచితంగా వైఫై సర్వీసును వినియోగించుకోగా.. అందులో 9065.27 టెరాబైట్ల డేటాను యూజర్లు వినియోగించుకున్నట్టు సెంట్రల్ రైల్వేస్ జనరల్ మేనేజర్ డీకే శర్మ తెలిపారు.
రైల్వే స్టేషన్లలో ఉచితంగా అందించే హైస్పీడ్ వైఫై సర్వీసును ప్రయాణికులు.. HD స్ట్రీమింగ్ వీడియోలు, మూవీలు, సాంగ్స్, గేమ్స్, స్టడీ మెటేరియల్స్ ను డౌన్ లోడ్ చేసుకోవడం కోసం వినియోగించుకోవచ్చు.
Read Also : ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి : జియో టాప్ 5 డేటా ప్లాన్ ఆఫర్లు ఇవే