75ఏళ్లు.. మహాత్మా గాంధీ సారథ్యంలోని ‘దండి మార్చ్’ ప్రాముఖ్యత ఇదే

Significance Of Dandi March Led By Mahatma Gandhi
Significance of Dandi March led by Mahatma Gandhi : ఉప్పు సత్యాగ్రహం.. దండి మార్చ్.. అప్పుడు మహత్మాగాంధీ ఎందుకు ఈ ఉప్పు సత్యాగ్రహాన్ని చేపట్టాల్సి వచ్చింది? అనేదానిపై చాలామందికి దాని ప్రాముఖ్యత గురించి చిన్నప్పటి పుస్తకాల్లో చదివే ఉంటారు. అప్పటి ఉప్పు సత్యాగ్రహం ప్రారంభమై నేటి 75 ఏళ్లు పూర్తి అవుతుంది. దీనికి ప్రతీకగా.. గుజరాత్, అహ్మదాబాద్‌లో మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమం నుంచి 25 రోజుల సుదీర్ఘ పాదయాత్రను ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం (మార్చి 12) ప్రారంభించారు. ఉప్పు ఉత్పత్తిపై బ్రిటిష్ గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ అహింసా నిరసనలో భాగంగా ఉప్పు సత్యాగ్రహం (సాల్ట్ మార్చ్) ఇదే రోజున ప్రారంభించారు. దీనికి దండి మార్చి అని పేరు ఉంది.
ఫాదర్ ఆఫ్ ది నేషన్ నేతృత్వంలో 78 మంది మార్చి 12, 1930న గాంధీ సబర్మతి ఆశ్రమం నుంచి ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. బ్రిటీషర్లు విధించిన ఉప్పు పన్ను చట్టాన్ని ఉల్లంఘించడం ద్వారా దేశంలో శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించాలనే ఉద్దేశ్యాన్ని గాంధీ వైస్రాయ్‌కు రాసిన లేఖలో ప్రస్తావించారు. మార్చి 5, 1930న దండిలో గాంధీ ఉప్పు ముద్దను తీసుకొని ఉప్పు చట్టాన్ని ధిక్కరించారు. ఆ తరువాత, ప్రతిచోటా ఉప్పు డిపోలపై దాడి చేశారు. ఉప్పు తయారీ చేపట్టి లక్షలాది మంది ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించారు.
దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బ్రిటీష్ ప్రభుత్వం మార్చి 31 నాటికి 95,000 మందికి పైగా అరెస్టు చేసింది. దండి వద్ద ఉప్పు తయారు చేసిన గాంధీ సహా ఉద్యమంలో పాల్గొన్న వారిని మే 5, 1930న అరెస్టు చేశారు. యెర్వాడ కేంద్ర జైలుకు తీసుకువెళ్లారు. కానీ అప్పటికే ఉప్పు సత్యాగ్రహం దేశవ్యాప్తంగా వ్యాపించింది. శాసనోల్లంఘనకు మొదటి పిలుపుగా నిలిచింది.
తద్వారా భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యమైన అధ్యాయాలలో ఇదొకటిగా నిలిచింది. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన 387 కిలోమీటర్ల పాదయాత్ర కూడా మహాత్మా గాంధీ మార్చ్‌కు నాయకత్వం వహించిన అదే మూలంలోనే ప్రారంభమవుతుందని కేంద్ర సంస్కృతి, పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ అన్నారు.