తొమ్మిది విమానాశ్రయాలపై ఆంక్షలు ఎత్తివేత

  • Published By: venkaiahnaidu ,Published On : February 27, 2019 / 03:07 PM IST
తొమ్మిది విమానాశ్రయాలపై ఆంక్షలు ఎత్తివేత

Updated On : February 27, 2019 / 3:07 PM IST

సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న కారణంగా పౌరవిమానాల రాకపోకలపై విధించిన ఆంక్షలను భారత్ ఎత్తివేసింది. భారత్-పాక్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా బుధవారం(ఫిబ్రవరి-27,2019) ఉదయం శ్రీనగర్,లేహ్,జమ్మూ,పఠాన్ కోఠ్, అమృత్ సర్, సిమ్లా,కాంగ్రా,కులు మనాలి,పితోడ్ గఢ్ విమానాశ్రాయాలను మూసివేసినట్లు ప్రకటించారు. ఎటువంటి విమానాలు ఆయా ఎయిర్ పోర్ట్ లలో టేకాఫ్ కాకుండా ఆంక్షలు విధించారు. అయితే ఆంక్షలను Iఉపసంహరించుకున్నట్లు డీజీసీఏ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆంక్షలు విధించిన తొమ్మిది విమానాశ్రయాల్లో యధావిధిగా రాకపోకలకు అనుమతిచ్చారు.మరోవైపు ఛండీగఢ్,ముంబై,పఠాన్ కోఠ్,హల్వారా,భటింద ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు.