రిజర్వేషన్‌ కౌంటర్లలోనూ తత్కాల్‌ టికెట్లకు ఓటీపీని తప్పనిసరి చేస్తున్న రైల్వే.. ఎందుకంటే?

బుకింగ్‌ ఏజెంట్లు ఈ వ్యవస్థను దోపిడీ చేయకుండా నిరోధించేందుకు రైల్వే శాఖ ఇటీవల కొన్ని చర్యలు తీసుకుంది.

రిజర్వేషన్‌ కౌంటర్లలోనూ తత్కాల్‌ టికెట్లకు ఓటీపీని తప్పనిసరి చేస్తున్న రైల్వే.. ఎందుకంటే?

Updated On : December 4, 2025 / 10:33 AM IST

Indian Railways: రైల్వే రిజర్వేషన్‌ కౌంటర్లలో ప్రయాణికుడు తత్కాల్‌ టికెట్లు పొందాలంటే వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ)ని తప్పనిసరి చేసే దిశగా రైల్వే చర్యలు తీసుకుంటోంది. దీంతో తత్కాల్ టికెట్‌ సదుపాయం దుర్వినియోగం రాకుండా ఆపవచ్చని అధికారులు చెప్పారు.

రైల్వే శాఖ ఈ ఓటీపీ ఆధారిత తత్కాల్‌ టికెటింగ్‌ వ్యవస్థను నవంబర్‌ 17న ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. కొన్ని ట్రైన్లతో మొదలు పెట్టి, ఆ సంఖ్యను 52కి పెంచింది. ఇది మంచి ఫలితాలను ఇవ్వడంతో కొన్ని రోజుల్లో ఈ ఓటీపీ బేస్డ్‌ రిజర్వేషన్‌ విధానాన్ని అన్ని మిగిలిన ట్రైన్లకు అమలు చేస్తామని శాఖ తెలిపింది.

Also Read: ఆ వివరాలన్నీ ఒకే పేజీలో ఉండేలా భూభారతి కొత్త పోర్టల్‌.. ధరణి పోర్టల్‌ను పూర్తిగా రద్దు చేస్తాం: పొంగులేటి

ఈ ఓటీపీ ఆధారిత తత్కాల్‌ రిజర్వేషన్‌ వ్యవస్థ సాధారణ ప్రయాణికుడికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంది. “తత్కాల్‌ టికెట్‌ను ప్రయాణికుడు కౌంటర్‌లో బుక్‌ చేస్తే, అతడు రిజర్వేషన్‌ ఫాంలో ఇచ్చిన మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ నిర్ధారణ సక్సెస్‌ అయిన తరువాతే టికెట్‌ కన్ఫర్మ్‌ అవుతుంది” అని రైల్వే శాఖ తెలిపింది.

దీని ద్వారా తత్కాల్‌ సదుపాయం దుర్వినియోగాన్ని తగ్గించడమే కాకుండా రైల్వే ప్రయాణం నిజంగా అవసరం ఉన్న ప్రయాణికుడికి టికెట్‌ అందేలా చేయొచ్చని చెప్పింది. ఇది రైల్వే టికెట్లలో పారదర్శకత, ప్రయాణికుడి సౌకర్యం, భద్రత పెంచే ముఖ్యమైన అడుగు అని తెలిపింది.

కాగా, బుకింగ్‌ ఏజెంట్లు ఈ వ్యవస్థను దోపిడీ చేయకుండా నిరోధించేందుకు రైల్వే శాఖ ఇటీవల కొన్ని చర్యలు తీసుకుంది. జూలైలో రైల్వే శాఖ దేశవ్యాప్తంగా తత్కాల్‌ ఆన్‌లైన్‌ బుకింగ్‌లను ఆధార్‌ నిర్ధారణ ఓటీపీతో తప్పనిసరి చేసింది. అక్టోబర్‌ 1 నుంచి ఏ ట్రైన్‌కైనా బుకింగ్‌ ప్రారంభమైన మొదటి 15 నిమిషాల్లో.. రిజర్వ్డ్‌ జనరల్‌ టికెట్లను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ లేదా యాప్‌లో ఆధార్‌ నిర్ధారిత యూజర్‌ మాత్రమే బుక్‌ చేసేలా రైల్వే చర్యలు తీసుకుంటోంది.