HIV positive : యూపీ ఆసుపత్రిలో 16 నెలల్లో 81 మంది గర్భిణులకు హెచ్‌ఐవీ…విచారణకు ఆదేశం

HIV positive : యూపీ ఆసుపత్రిలో 16 నెలల్లో 81 మంది గర్భిణులకు హెచ్‌ఐవీ…విచారణకు ఆదేశం

pregnant women HIV positive

HIV positive : ఓ ఆసుపత్రిలో 16 నెలల్లో 81 మంది గర్భిణులకు హెచ్‌ఐవీ పాజిటివ్ సోకడం సంచలనం రేపింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లాలోని లాలా లజపతిరాయ్ మెడికల్ కాలేజీలో 81 మందికి పైగా మహిళలకు హెచ్ఐవీ ఎలా సోకిందో తెలుసుకోవడానికి వైద్యనిపుణుల బృందాన్ని నియమించారు. (HIV positive) ప్రభుత్వ వైద్య కళాశాలలో గత 16 నెలల్లో 81 మందికి పైగా గర్భిణీ స్త్రీలు హెచ్‌ఐవి పాజిటివ్‌గా గుర్తించామని, దీనిపై తాము విచారణకు ఆదేశించామని ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు. (81 pregnant women found HIV positive)

MS Dhoni’s Daughter Ziva : ధోని కుమార్తె జీవా ఏ స్కూల్‌లో చదువుతుందంటే…ఆ స్కూలు ఫీజు తెలిస్తే షాక్ అవుతారు

ఆరోగ్య శాఖకు చెందిన బృందం కూడా దీనిపై నిఘా ఉంచిందని అధికారి తెలిపారు. మీరట్‌లోని లాలా లజపత్ రాయ్ మెడికల్ కాలేజ్‌లోని (UP hospital) యాంటీ-రెట్రోవైరల్ థెరపీ సెంటర్ నుంచి వచ్చిన నివేదిక ప్రకారం లాలా లజపత్ రాయ్ ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చిన 81 మంది గర్భిణీ స్త్రీలకు హెచ్‌ఐవి నిర్ధారణ అయిందని తేలింది. బాధిత మహిళలందరూ మెడికల్ కాలేజీలోని ఏఆర్‌టీ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారని, బాగానే ఉన్నారని మెడికల్ కాలేజీ అధికారులు తెలిపారు.

Onion prices : ఈ నెలాఖరు నాటికి కిలో ఉల్లి రూ.70 …క్రిసిల్ మార్కెట్ ఇంటలిజెన్స్ హెచ్చరిక

నవజాత శిశువుల ఆరోగ్యం గురించి ఏఆర్‌టీ సెంటర్ నోడల్ అధికారిని అడిగితే, 18 నెలలు నిండిన తర్వాత నవజాత శిశువులకు హెచ్‌ఐవి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. హెచ్‌ఐవీ సోకిన మహిళలు, నవజాత శిశువులు ఆరోగ్యంగా ఉన్నారని మీరట్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ (సీఎంఓ) డాక్టర్‌ అఖిలేష్‌ మోహన్‌ ప్రసాద్‌ చెప్పారు. మహిళలకు హెచ్‌ఐవి ఎలా వచ్చిందనే కారణాలను తెలుసుకోవడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేశామని సిఎంఓ ప్రసాద్ తెలిపారు.

Manipur : మణిపుర్‌లో మళ్లీ హింసాకాండ…ముగ్గురి మృతి, ఇళ్లు దహనం

హెచ్‌ఐవి సోకిన రక్తం, వీర్యం లేదా యోని ద్రవాలు శరీరంలోకి ప్రవేశించినప్పుడు హెచ్‌ఐవి వ్యాప్తి చెందుతుంది. అంగ సంపర్కం ద్వారా లేదా మందులు లేదా పచ్చబొట్టు కోసం సూదులు గుచ్చుకోవడం ద్వారా లేదా సోకిన వ్యక్తి రక్తం సూదితో అంటుకోవడం ద్వారా హెచ్‌ఐవి వ్యాపిస్తుంది. హెచ్‌ఐవి సోకిన మహిళ గర్భధారణ సమయంలో, ప్రసవ సమయంలో లేదా తల్లి పాలివ్వడంలో తల్లి నుంచి బిడ్డకు కూడా సంక్రమిస్తోంది.