Oxygen 90 శాతం కంటే తక్కువగా ఉందా..డేంజర్ జోన్ లో ఉన్నట్లే!

  • Published By: madhu ,Published On : July 15, 2020 / 06:53 AM IST
Oxygen 90 శాతం కంటే తక్కువగా ఉందా..డేంజర్ జోన్ లో ఉన్నట్లే!

Updated On : July 15, 2020 / 10:13 AM IST

కరోనా ఉగ్రరూపం ఇంకా తక్కువ కావడం లేదు. ప్రపంచ వ్యాప్తంగ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. లక్షలాది మంది ప్రజలు వైరస్ బారిన పడుతున్నారు. అదే సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. భారతదేశంలో కూడా వైరస్ విస్తరిస్తూనే ఉంది.

పలు రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇందుకు వ్యాక్సిన్ కనుక్కొనేందుకు అటు శాస్త్రవేత్తలు, వైరస్ కట్టడి చేసేందుకు వైద్యులు, ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు పలు సూచనలు అందచేస్తున్నారు.

ఎక్కువ శాతం ఆక్సిజన్ లేకపోవడంతో మరణాలు సంభవిస్తున్న సంగతి తెలిసిందే. ఆక్సిజన్ గురించే చాల మంది భయపడుతున్నారు. కానీ కరోనా సోకిన వాళ్లందరికీ ఆక్సిజన్ అవసరం లేదని, కేవలం 5 శాతం మందికి మాత్రమే అవసరం అవుతోందని వైద్యులు తాజాగా వెల్లడించారు.

ఆరోగ్యంగా ఉన్న వారిలో 95 శాతం వరకు ఆక్సిజన్ నిల్వలు ఉంటాయని, 90 శాతం కంటే తక్కువగా ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదిస్తే బెటర్ అని సూచిస్తున్నారు. 85 శాతం కంటే తక్కువగా ఉంటే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గమనించాలని, వెంటనే వైద్య సాయాన్ని పొందడం చాలా మంచిదంటున్నారు.

దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధ పడుతున్న వారు..60 ఏళ్ల దాటిన వారు..అప్పుడప్పుడు ఆక్సిజన్ నిల్వలు చూసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం డిజిటల్ పలాక్సీ మీటర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతి రోజు నడక, ప్రాణామాయం వంటివి చేస్తే ఆక్సిజన్ లెవల్స్ పెంచుకోవచ్చని వెల్లడిస్తున్నారు.