ఆ బాబు పేరు లాక్ డౌన్.. కారణం చెప్పిన తల్లిదండ్రులు

యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు విలవిలలాడుతోంది. 200కు పైగా దేశాల ప్రజలు నిద్ర లేని రాత్రులు గుడుపుతున్నారు. రోజురోజుకు కొత్త కేసులతో పాటు

  • Published By: veegamteam ,Published On : April 20, 2020 / 04:37 AM IST
ఆ బాబు పేరు లాక్ డౌన్.. కారణం చెప్పిన తల్లిదండ్రులు

Updated On : April 20, 2020 / 4:37 AM IST

యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు విలవిలలాడుతోంది. 200కు పైగా దేశాల ప్రజలు నిద్ర లేని రాత్రులు గుడుపుతున్నారు. రోజురోజుకు కొత్త కేసులతో పాటు

యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు విలవిలలాడుతోంది. 200కు పైగా దేశాల ప్రజలు నిద్ర లేని రాత్రులు గుడుపుతున్నారు. రోజురోజుకు కొత్త కేసులతో పాటు మరణాల సంఖ్యా పెరుగుతోంది. ఇంతవరకు కరోనాకు వ్యాక్సిన్ రాలేదు. దీంతో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. ప్రజలను ఇళ్లకే పరిమితం చేశాయి. అత్యవసర పనులు ఉంటే తప్ప రోడ్డు మీదకు రానివ్వడం లేదు. 

కరోనా, లాక్ డౌన్ సమయంలో భిన్నమైన పేర్లు:
అందుకే… కరోనా వైరస్, లాక్ డౌన్ అనే రెండు పదాలు వింటే ప్రజల గుండెల్లో వణుకు పుడుతోంది. ఈ రెండూ మళ్లీ తమ జీవితంలో చూడకూడదని అందరూ దేవుడిని ప్రార్థిస్తున్నారు. అయితే, అలాంటి పేర్లను తమకు పుట్టే పిల్లలకు పెడుతున్నారు కొందరు తల్లిదండ్రులు. లాక్ డౌన్ సమయంలో తమకు పుట్టిన పిల్లలకు చాలా భిన్నంగా పేర్లు పెట్టుకుంటున్నారు కొంతమంది తల్లిదండ్రులు. జీవిత కాలం గుర్తిండిపోయేలా పేర్లు పెడుతున్నారు. కొందరు పిల్లలకు లాక్ డౌన్ అని నామకరణం చేస్తే మరికొందరు కరోనా అని నామకరణం చేసి ముచ్చట తీర్చుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ఈ విధంగా పేర్లు పెట్టి న్యూస్ కి ఎక్కారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి రాజస్తాన్ లో జరిగింది.

బాబుకి లాక్ డౌన్ అని నామకరణం:
రాజస్తాన్ కు చెందిన సంజయ్ బౌరి, మంజు బౌరి భార్యాభర్తలు. సంవత్సరంలో ఆరు నెలలు అన్ని రాష్ట్రాల్లో తిరుగుతూ ప్లాస్టిక్ వస్తువులను అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఈ సారి సరికొత్త అనుభవం ఎదురైందట. మార్చి 24న ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ప్లాస్టిక్ వస్తువులను విక్రయించేందుకు దంపతులిద్దరూ త్రిపుర రాష్ట్రానికి వెళ్లారు. మంజు గర్భిణి కావడంతో బస్సు, రైలులో రాజస్థాన్ కు ప్రయాణం చేయడం ప్రమాదమని సంజయ్ బౌరి అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆ మరుసటి రోజే కేంద్రప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో రాజస్థాన్ కు వెళ్లాలని బాధర్ ఘాట్ దగ్గర అగర్తల రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో అక్కడే చిక్కుకుపోయారు.

అదే సమయంలో మంజు మగబిడ్డకు జన్మ ఇచ్చింది. ప్రస్తుతం బాబు పుట్టి ఆరు రోజులవుతోంది. లాక్ డౌన్ సమయంలో పుట్టడంతో తమ కుమారుడికి లాక్ డౌన్ అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు దంపతులు చెప్పారు. కష్టకాలంతో తమకు ఆశ్రయం కల్పించి తన భార్యను ఆసుపత్రికి తరలించడంలో సాయం చేసిన రైల్వే పోలీసులు, త్రిపుర రాష్ట్ర ప్రభుత్వానికి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు.

జాతిని ఏకం చేసిన కరోనా:
కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి, ప్రజల ప్రాణాలు కాపాడడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పేరు విన్నప్పుడల్లా కరోనాతో పాటు వ్యక్తిగత ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలు ముఖ్యమనే భావన ప్రజల్లో వస్తుందని తాము భావిస్తున్నట్టు సంజయ్ దంపతులు తెలిపారు. 

జనతా కర్ఫ్యూ రోజున పుట్టిన పాపకు కరోనా అని పేరు:
గతంలో ఉత్తర్ ప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. దియోరియా జిల్లాలో ఖుకుందు గ్రామంలో మార్చి 30న ఓ బాబు పుట్టాడు. ఆ పసిబిడ్డకు తల్లిదండ్రులు ‘లాక్ డౌన్’ అని పేరు పెట్టారు. ఇక మార్చి 22న జనతా కర్ఫ్యూ రోజున యూపీలోని గోరఖ్‌పూర్‌లో పుట్టిన పసిబిడ్డకు ఆ బాలిక మేనమామ నీతిష్ త్రిపాఠీ ‘కరోనా’ అని పేరు పెట్టాడు. కరోనా అనే భయంకరమైన పేరును ఆ పసిబిడ్డకు పెట్టడానికి కారణాన్ని కూడా చెప్పాడు. కరోనా వైరస్ ప్రపంచాన్ని ఐక్యం చేసిందని తెలిపాడు. అలాగే, ఎన్నో మంచి అలవాట్లు కూడా నేర్పిందని చెప్పాడు. కరోనా అనే మహమ్మారి మీద పోరాటాన్ని ఈ బాలిక గుర్తు చేస్తుందని తాను భావిస్తున్నట్టు వివరించాడు.

Also Read | దేశవ్యాప్తంగా 17, 265 కరోనా కేసులు… 543 మంది మృతి