Congress on disgruntled Leaders: మేము ఎవరి నోరూ మూయించబోము: కాంగ్రెస్ పార్టీ

కాంగ్రెస్ ఐక్యంగా ఉందని, తమది ప్రజాస్వామ్య విలువలు పాటించే పార్టీ అని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ అన్నారు. అభిప్రాయాలు తెలిపే స్వేచ్ఛను కాంగ్రెస్ పార్టీ తమ నేతలకు ఇస్తుందని, తాము ఎవరి నోరూ మూయించబోమని చెప్పారు. ఆ పార్టీకి సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఇటీవల రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పై బీజేపీ నేతుల చేస్తోన్న విమర్శలను జైరాం రమేశ్ తిప్పికొట్టారు. కాంగ్రెస్ పై అసంతృప్తితో ఉన్నవారు పలు రకాల వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారని, తమ పార్టీ మాత్రం ఐక్యంగానే ఉందని అన్నారు.

Congress on disgruntled Leaders: మేము ఎవరి నోరూ మూయించబోము: కాంగ్రెస్ పార్టీ

AICC President election

Updated On : September 5, 2022 / 4:14 PM IST

Congress on disgruntled Leaders: కాంగ్రెస్ ఐక్యంగా ఉందని, తమది ప్రజాస్వామ్య విలువలు పాటించే పార్టీ అని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ అన్నారు. అభిప్రాయాలు తెలిపే స్వేచ్ఛను కాంగ్రెస్ పార్టీ తమ నేతలకు ఇస్తుందని, తాము ఎవరి నోరూ మూయించబోమని చెప్పారు. ఆ పార్టీకి సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఇటీవల రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పై బీజేపీ నేతుల చేస్తోన్న విమర్శలను జైరాం రమేశ్ తిప్పికొట్టారు. కాంగ్రెస్ పై అసంతృప్తితో ఉన్నవారు పలు రకాల వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారని, తమ పార్టీ మాత్రం ఐక్యంగానే ఉందని అన్నారు.

ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో నిన్న కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీ విజయవంతమైందని చెప్పారు. తమ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త పూర్తి నిబద్ధతో పనిచేస్తున్నారని జైరాం రమేశ్ అన్నారు. అదే ఉత్సాహంతో భారత్ జోడో యాత్ర నిర్వహిస్తామని చెప్పారు. కాంగ్రెస్ చాలా పెద్ద పార్టీ అని, ఇందులోని నేతలకు రకరకాల అభిప్రాయాలు ఉంటాయని అన్నారు.

కొందరు లేఖలు రాస్తారని, కొందరు ట్వీట్లు చేస్తారని, కొందరు ఇంటర్వ్యూలు ఇస్తారని, దీన్ని బట్టే తమ పార్టీ ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీ అని తెలుస్తోందని జైరాం రమేశ్ అన్నారు. తమ పార్టీలో నియంతృత్వం లేదని చెప్పారు. తాము నిశ్శబ్దంగా ఉండబోమని చెప్పారు. గులాం నబీ ఆజాద్ లాంటి వారి గురించి తాను మళ్ళీ ఏమీ చెప్పదలుచుకోలేదని, ఇప్పటికే దీనిపై మాట్లాడానని అన్నారు.

China vs America: చైనా-అమెరికా పరస్పరం సైబర్ దాడులు?.. అగ్రరాజ్యంపై మళ్ళీ మండిపడ్డ డ్రాగన్