Petrol Diesel Prices : దేశవ్యాప్తంగా మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.110.91, డీజిల్ రూ.97.23కు చేరాయి. ఏపీలో లీటర్ పెట్రోల్ 88, డీజిల్ 84 పైసలు పెరిగింది. గుంటూరులో పెట్రోల్ రూ.112.96, లీటర్ డీజిల్ 98.94కు చేరాయి.

Petrol Diesel Prices : దేశవ్యాప్తంగా మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Petro Price

Updated On : March 25, 2022 / 8:06 AM IST

Petrol and diesel prices : దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దేశీయ చమురు కంపెనీలు తాజాగా లీటర్ పెట్రోల్, డీజిల్ పై 80 పైసల చొప్పున పెంచాయి. దీంతో ఈ వారంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఇది మూడోసారి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 97.81, డీజిల్ రూ. 89.07గా ఉన్నాయి. ముంబైలో పెట్రోల్ 84 పైసలు, డీజిల్ 85 పైసలు చొప్పన పెరిగింది. దీంతో ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 112.51, డీజిల్ రూ. 96.70కు చేరాయి.

చెన్నైలో పెట్రోల్, డీజిల్ 76 పైసల చొప్పున పెరగడంతో పెట్రోల్ రూ.103.67, డీజిల్ రూ.93.71కు పెరిగింది. కోల్ కతాలో పెట్రోల్ 84 పైసలు, డీజిల్ 80 పైసలు చొప్పున పెరిగింది. దీంతో కోల్ కతాలో లీటర్ పెట్రోల్ రూ.106.34, డీజిల్ రూ.91.42కు చేరింది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 90 పైసలు, డీజిల్ 87 పైసల చొప్పున పెరిగింది.

Petrol Prices: భారత్‌కి బ్యాడ్ న్యూస్, యుద్ధం దెబ్బకు భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

దీంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర.110.91, డీజిల్ రూ.97.23కు చేరాయి. ఏపీలో లీటర్ పెట్రోల్ పై 88, లీటర్ డీజిల్ పై 84 పైసలు పెరిగింది. దీంతో గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ.112.96, లీటర్ డీజిల్ 98.94కు చేరాయి. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.112.76, లీటర్ డీజిల్ 98.74కు పెరిగింది.

దేశంలో గతేడాది నవంబర్‌ 4వ తేదీ తర్వాత మొదటిసారిగా మార్చి22న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అధికమయ్యాయి. మార్చి 23న కూడా చమురు కంపెనీలు పెట్రో ధరలు పెంచాయి. తాజా పెంపుతో మూడు రోజుల్లోనే లీటరు పెట్రోల్‌, డీజిల్ ధరలు రూ.2.40 చొప్పున పెంచారు.

Petrol Price Hike : లీటర్ పెట్రోల్ రూ.254.. ఎక్కడంటే ?

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడంతో చమురు కంపెనీలు లీటరు డీజిల్ పై రూ.13.1 నుంచి రూ.24.9 వరకు, పెట్రోల్ పై రూ.10.6 నుంచి రూ.22.3 వరకు పెంచే అవకాశం ఉందని వ్యాపారవర్గాల అంచనా.