Petrol Rate Today : మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర.. హైదరాబాద్‌లో లీటర్ రూ. 110

పెట్రోల్ రేట్లు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. గడిచిన 16 రోజుల్లో పెట్రోల్ రేటు 4.08 రూపాయలు పెరిగింది. డీజిల్ రేటు 4.76 రూపాయలు పెరిగింది.

Petrol Rate Today : మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర.. హైదరాబాద్‌లో లీటర్ రూ. 110

Petrol

Updated On : October 17, 2021 / 7:34 AM IST

Petrol Rate Today : పెట్రోల్ రేట్లు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. గడిచిన 16 రోజుల్లో పెట్రోల్ రేటు 4.08 రూపాయలు పెరిగింది. డీజిల్ రేటు 4.76 రూపాయలు పెరిగింది. శుక్ర, శనివారాల్లో 70పైసలు పెరిగింది. నిత్యం పెరుగుతున్న ఫ్యూయల్ ధరలను చూసి వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజలపై పెట్రోల్ రేట్ల ప్రభావం అధికంగా పడుతుంది. అధిక ధరల ప్రభావం ట్రావెల్స్ పై అధికంగా పడుతుంది. చాలా ట్రావెల్స్ డీజిల్ ధరలను చూసి తాత్కాలికంగా నిలిపివేశారు. ధరలు పెంచితే ప్రయాణికులు వచ్చేలా లేరని.. నష్టాల్లోనే ట్రావెల్స్ నడుపుతున్నామని కొందరు చెబుతున్నారు.

చదవండి : TSRTC : ఆర్టీసీలో సజ్జనార్ మార్క్.. బస్టాండ్‌లో స్టాళ్లపై కొరడా

ఇక నేడు పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర.110.08కి పెరిగింది. లీటర్ డీజిల్ రేటు 103.15కు చేరింది. శనివారం పెంపుతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.105.49కి పెరుగగా.. ముంబైలో 111.43కి చేరింది. అలాగే లీటరు డీజిల్‌ ధర ఢిల్లీలో రూ.94.22కు ఎగబాకింది. విజయవాడ పెట్రోల్ ధర రూ. 112.04 డీజిల్ ధర రూ. 104.44 కి చేరింది.

చదవండి : Petrol Rate : తగ్గేదే..లే పరుగులు పెడుతున్న డీజిల్, పెట్రోల్ ధరలు.. ఈ రోజు ఎంత పెరిగిందంటే?