Petrol-Diesel Prices Today : మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
దేశవ్యాప్తంగా మళ్లీ ఇందన ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. లీటర్ పెట్రోల్ పై 29 పైసలు, డీజిల్‌పై 30 పైసలు పెరిగింది. మే 4 నుంచి ఇప్పటి వరకు 24 సార్లు పెట్రోల్, డీజల్ ధరలు పెరిగాయి.

Petrol Diesel Prices Today
Petrol-Diesel Prices Today : దేశవ్యాప్తంగా మళ్లీ ఇందన ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. లీటర్ పెట్రోల్ పై 29 పైసలు, డీజిల్‌పై 30 పైసలు పెరిగింది. మే 4 నుంచి ఇప్పటి వరకు 24 సార్లు పెట్రోల్, డీజల్ ధరలు పెరిగాయి. ఈ 24 సార్ల ఇందన ధరల పెరుగుదలలో ఇప్పటి వరకు పెట్రోల్ పై రూ.5.72 పెంచగా.. డీజిల్ పై రూ. 6.25 వరకు పెరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ. 96.41 ఉండగా.. డీజిల్ లీటర్ ధర రూ. 87.28 గా ఉంది. ముంబై నగరంలో పెట్రోల్ లీటరు రూ. 102.58, డీజిల్ రూ. 94.70 గా ఉంది. రాజస్థాన్ గంగానగర్‌లో అత్యాధికంగా పెట్రోల్ ధర లీటర్‌కు రూ. 107.53, డీజిల్ రూ. 100.37 వరకు పెరిగింది. తెలంగాణలోని హైదరాబాద్‌లో పెట్రోలు రూ.100.20 చేరగా.. డీజిల్ రూ. 95.14 గా ఉంది.
కోల్‌కతాలో పెట్రోలు ధర రూ.96.34 ఉండగా.. డీజిల్ ధర రూ. 90.12 గా నమోదైంది. చెన్నై నగరంలో పెట్రోలు ధర లీటర్ రూ.97.69 ఉండగా.. డీజిల్ లీటర్ ధర రూ. 91.92గా నమోదైంది. రోజురోజుకీ చమురు ధరలు పెరుగుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ సహా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లోని పలు చోట్ల పెట్రోల్ ధర రూ.100 దాటేసింది. గత ఏడాది కాలంలో లీటరుకు సుమారుగా రూ. 28 వరకు పెట్రోల్ ధర పెరిగింది. అలాగే డీజిల్ ధర రూ.25 వరకు పెరిగింది.