Mansukh Mandaviya : కేంద్ర మంత్రిపై చేయి చేసుకున్న సెక్యూరిటీ గార్డు

కేంద్ర మంత్రిని కొట్టిన సెక్యూరిటీ గార్డా....అవును ఆ ఆస్పత్రివద్ద ఉన్న సెక్యూరిటీ గార్డు కేంద్ర మంత్రిపై చేయిచేసుకున్నాడు.

Mansukh Mandaviya : కేంద్ర మంత్రిపై చేయి చేసుకున్న సెక్యూరిటీ గార్డు

Mansukh Mandaviya

Updated On : September 20, 2021 / 11:12 AM IST

Mansukh Mandaviya :  కేంద్ర మంత్రిని కొట్టిన సెక్యూరిటీ గార్డా….అవును ఆ ఆస్పత్రివద్ద ఉన్న సెక్యూరిటీ గార్డు కేంద్ర మంత్రిపై చేయిచేసుకున్నాడు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రే స్వయంగా వెల్లడించారు. కేంద్ర ఆరోగ్యమంత్రి మనుసుఖ్ మాండవీయ ఇటీవల ఢిల్లీలోని సఫ్దార్ జంగ్ ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీ చేయటానికి సాధారణ రోగిలా వచ్చారు. అక్కడే  ఉన్న  ఒక బెంచిపై కూర్చుంటుండగా… అక్కడ ఉన్నసెక్యూరిటీ గార్డు ఆయన్ను బలవంతంగా లేపి…. చేయి చేసుకున్నాడు.
Also Read : Online Ticket Booking Portal : సినీ పరిశ్రమ పెద్దలతో ఏపీ మంత్రి పేర్ని నాని సమావేశం

సఫ్దార్ జంగ్ ఆస్పత్రిలో  కొత్తవార్డులు ప్రారంభించటానికి గురువారం వచ్చిన కేంద్ర మంత్రి ఈవిషయాన్ని సభాముఖంగా వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్లానని ఆయన తెలిపారు. అయితే ఆ గార్డును సస్పెండ్ చేయలేదని ఆయన చెప్పారు. వ్యక్తులను కాదు, వ్యవస్ధను మార్చాలన్నదే తన ఉద్దేశ్యమని కేంద్ర మంత్రి అన్నారు. ఆస్పత్రిలో వైద్యులు ఇతర సిబ్బంది సమన్వయంతో పని చేస్తేనే రోగులకు మెరుగైన సేవలు అందించగలుగుతామని ఆయన అన్నారు.