PM Kisan : అన్నదాతలకు శుభవార్త..పీఎం కిసాన్ పథకం డబ్బులు జమ..ఎప్పుడో తెలుసా ?

రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్రం తీసుకొచ్చిన పథకం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. దీని కింద ప్రతి ఏటా రూ.6 వేలను మూడు విడతల్లో

PM Kisan : అన్నదాతలకు శుభవార్త..పీఎం కిసాన్ పథకం డబ్బులు జమ..ఎప్పుడో తెలుసా ?

Pm Kisan

Updated On : December 29, 2021 / 7:02 PM IST

PM Kisan Samman Nidhi Yojana : రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. మరో రెండు రోజుల్లో నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో…పీఎం – కిసాన్ (ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి)కి సంబంధించిన డబ్బుల జమ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ నిధుల్ని 2022, జనవరి 01వ తేదీన జమ చేయనున్నామని వెల్లడించింది. జనవరి 01వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు పదో విడతకు సంబంధించి నిధులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్పరెన్స్ ద్వారా విడుదల చేస్తారని పేర్కొంది.

Read More : Sajjala Ramakrishnareddy : చంద్రబాబు అజెండానే బీజేపీ అజెండా : సజ్జల

రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్రం తీసుకొచ్చిన పథకం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. దీని కింద ప్రతి ఏటా రూ.6 వేలను మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది దేశ వ్యాప్తంగా దాదాపు 10 కోట్ల రైతుల కుటుంబాల్లో రూ. 20 వేల కోట్లకు పైగా సొమ్మును జమ చేయడం జరుగుతుందని తెలిపింది. భారతదేశంలో అర్హులైన రైతుల కుటుంబాల్లో ఈ పథకం కింద ప్రతి సంవత్సరం రూ. 6 వేల చొప్పున జమ చేస్తూ వస్తోంది కేంద్రం.

Read More : Tamil Nadu : చెన్నైలో మళ్లీ కంటోన్మెంట్ జోన్‌‌లు!

సంవత్సరంలో మొత్తం మూడు విడతల్లో ఈ నగదును వారి వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు రూ. 1.6 లక్షల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడిస్తోంది. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ప్రయోజనాలను పొందాలనుకునే రైతులు అక్టోబర్ 30 లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలి.