PM Modi : నలభై ఏళ్ల తర్వాత గ్రీస్‌లో పర్యటించిన మొదటి ప్రధాని మోదీ

PM Modi : నలభై ఏళ్ల తర్వాత గ్రీస్‌లో పర్యటించిన మొదటి ప్రధాని మోదీ

PM Modi arrives in Greece

Updated On : August 26, 2023 / 3:55 PM IST

PM Modi : నలభై ఏళ్ల తర్వాత మొదటిసారి భారతప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం గ్రీస్ దేశ పర్యటనకు వెళ్లారు. ప్రధాని మోదీ ఏథెన్స్‌లో అడుగుపెట్టగానే గ్రీస్‌లోని భారతీయులు హోటల్ వెలుపల ఘనస్వాగతం పలికారు. గ్రీస్‌ ప్రధాని కిరియాకోస్‌ మిత్సోటాకిస్‌ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ గ్రీస్ దేశంలో పర్యటిస్తున్నారు. ( PM Modi arrives in Greece) ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన పట్ల గ్రీస్‌ దేశం ఏథెన్స్‌లోని భారతీయులు హర్షం వ్యక్తం చేశారు.

Heavy Rainfall : పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు..ఐఎండీ హెచ్చరిక

‘‘ప్రధాని మోదీకి గ్రీస్‌లో స్వాగతం పలకడానికి ఇక్కడకు వచ్చాను. గత తొమ్మిదేళ్లలో ప్రపంచానికి అందించిన సాంకేతిక పరిజ్ఞానంతో మేం అద్భుతమైన పురోగతి సాధించాం’’ అని స్టార్టప్ గ్రీస్ ఆర్గనైజేషన్ మేనేజింగ్ డైరెక్టర్ థానోస్ పారాషోస్ చెప్పారు. (first prime ministerial visit in 40 years) ‘‘ప్రధాని మోదీ ఇక్కడికి వస్తున్నారని తెలిసి రావడం మాకు ఆనందంగా ఉంది.. పాకిస్థాన్‌ పరిధిలో కర్తార్‌పూర్ కారిడార్‌ను తెరవడం మోదీ గొప్పతనం, మోదీకి మేం భాంగ్రా నృత్యంతో స్వాగతం పలికాం’’ అని గ్రీస్ నివాసి దల్జీత్ సింగ్ చెప్పారు.

Donald Trump : పోల్ రాకెటింగ్ కేసులో డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్, బాండ్‌పై విడుదల

ప్రధానమంత్రి మోదీ పర్యటనలో గ్రీస్‌లోని భారతీయ సంఘం సభ్యులు భారత్ మాతా కీ జై, వందేమాతరం, మోదీ జీ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం కనిపించింది. బ్రిక్స్ సదస్సుకు హాజరైన ఆయన దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ నుంచి గ్రీస్ దేశానికి బయలుదేరి వచ్చారు. గ్రీక్ ప్రధాని కైరియాకోస్ మిత్సోటాకిస్‌తో మోదీ సమావేశమవుతారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత పటిష్ఠం చేసే మార్గాలపై ఇద్దరు నేతలు చర్చిస్తారు. ఇరు దేశాలకు చెందిన వ్యాపారవేత్తలతోనూ మోదీ సంభాషించనున్నారు. అతను గ్రీస్‌లోని భారతీయ సభ్యులతో కూడా భేటీ కానున్నారు.